విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటు శక్తివంతమైన ఆయుధమని దానిని సరైన వ్యక్తి ఓటువేసి గెలిపించాలని గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్.ఆర్.గాంధీ నాగరాజన్ (నేటి గాంధీ) ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని పలు కూడలి ప్రాంతాలలో తన ప్రచార రథంతో ఓటర్ల అవగాహన ప్రచారం కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ వారి వారి స్వప్రయోజనాల కోసం కాకుండా ప్రజలకు ఎలాంటి ఆపేక్ష లేకుండా సేవలు అందించేందుకు కృషి చేసేవారినే ఎన్నుకోవాలని గాంధీనాగరాజన్ ఓటర్లను కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎవరు ముందుకు వస్తారో వారికే ఓటయ్యాలన్నారు. వివిధ పార్టీల నాయకులు ఆయనకు సంఘీభావం తెలిపారు. ప్రచారంలో వివిధ పార్టీల నాయకులను కలిశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎపి అధ్యక్షురాలు బంగారు భారతి, ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News