కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జోగి రమేష్ బుధవారం కంకిపాడు మండల పరిధిలోని కందలంపాడు, జగన్నా ధపురం, కోమటిగుంటలాకులు, క్రిస్టియన్ పేట గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్నినిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ తమకు ఓట్లను వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ 14 సం వత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు తను అధి కారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమి చేయ లేదని మరల ఇప్పుడు అబద్దపు వాగ్దానాలతో ముందుకు వస్తున్న చంద్రబాబు ను నమ్మి సంక్షేమాన్నిచ్చే జగనన్నను విస్మరించకుండా మరల రానున్న ఎన్నికలలో వైసీపీ కి అండగా నిలిచి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి సంక్షేమ పథకాలను కొనసాగించడానికి ప్రజలందరూ దోహదపడాలని మంత్రిజోగి రమేష్ ప్రజలను కోరారు. ఈ కార్య క్రమంలో చలసాని పండుకుమార్తె దేవినేని స్మిత, రాష్ట్ర సగరి కుల కార్పొ రేషన్ డైరెక్టర్ నక్కా శ్రీనివాస్, జగన్నాధపురం గ్రామ సర్పంచ్ పిన్నిబోయిన శ్రీని వాసరావు, తెన్నేరు గ్రామ సర్పంచ్ లాం ఎలీషా, కందలంపాడు గ్రామ సర్పంచ్ బైరెడ్డి నాగరాజు, టెక్కెం సతీష్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్య కర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News