-ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డాక్టర్ యస్.వెంకటేశ్వర్
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ స్థాయిలో కేన్సర్ స్క్రీనింగ్‌కు కార్యాచరణ ప్రణాళికను వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేస్తోందని, ఈ క్రమంలోనే రాష్ట్ర స్థాయిలో శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అన్నారు. అగనంపూడిలోని హోమీ బాబా కేన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ లో మంగళవారం నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రివెంటివ్ అంకాలజీపై కమ్యూనిటీ హెల్త్ మెడిసిన్, గైనకాలజీ, ఇఎన్‌టి, డెంటిస్ట్రీ, పేథాలజీ, సర్జరీ విభాగాల్లో పాల్గొన్న ప్రభుత్వ వైద్య కళాశాలల వైద్య నిపుణులకు నిర్వహించిన సెన్సిటైజేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలో శిక్ణణ ఇచ్చేందుకు మంచి మానవ వనరులున్నాయన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వైద్య నిపుణులు జిల్లా స్థాయిలో శిక్షణివ్వాలనీ, తిరిగి వారు ఎఎన్ ఎం, సిహెచ్వోలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతచేయాలన్నారు. సిహెచ్వోలు(గతంలో ఎంఎల్‌హెచ్‌పీలు) ముందుగా స్క్రీనింగ్ చేసి సంబంధిత మెడికల్ ఆఫీసర్‌కు రిఫర్ చేయాలన్నారు, అటు తర్వాత రిఫర్ చేసిన కేన్సర్ కేసుల విషయంలో ప్రభుత్వ వైద్య కళాశాల్లోని వైద్య నిపుణులు కలుగజేసుకోవాల్సిన అవసరం ఉందన్నా యరు. మీరు సెకండరీ హెల్త్ డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్ల కు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేన్సర్ స్క్రీనింగ్ విషయంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముందునుంచే ప్రయత్నం చేస్తోందన్నారు.దీన్ని విజయవంతం చేసేందుకు విలువైన సలహాల్ని ఇవ్వాలని ఈ సందర్భంగా వైద్య నిపుణుల్ని ఆయన కోరారు. ఏపీలో శిక్షనిచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖలో తగిన మానవ వనరులున్నాయన్నారన్నారు. స్టేట్ కేన్సర్ స్క్రీనింగ్ పాలసీ పై చర్చించే ప్రయత్నం చేద్దామన్నారు. బ్రెస్ట్ కేన్సర్ , సర్వకైల్ కేన్సర్ మరియు ఓరల్ కేన్సర్ విషయంలో ఇప్పుడు స్క్రీనింగ్ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ సుముఖంగా ఉందన్నారు. హోమీ బాబా కేన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ మహంతిశెట్టి, రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ రవితేజ, ఎన్సీడీ స్టేట్ నోడల్ ఆఫీసర్ శ్యామల, డాక్టర్ అనిల్ కుమార్ (డిఎంఇ నోడలాఫీసర్), కన్సల్టెంట్ రాజ్ కిరణ్ తదితరులు కమీషనర్ మరియు ఎండీ ఎన్‌హెచ్ఎం డాక్టర్ వెంకటేశ్వర్ వెంట ఉన్నారు.
హోమీ బాబా కేన్సర్ హాస్పిటల్లో కలియ తిరిగిన కమీషనర్ డాక్టర్ వెంకటేశ్వర్
శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ మరియు నేషనల్ హెల్త్ మిషన్ ఏపీ డైరెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ హోమీ బాబా కేన్సర్ ఆసుపత్రి మరియు రీసెర్చ్ సెంటర్లో కలియ తిరిగారు. కేన్సర్ కు సంబంధించి ఇక్కడ అందుబాటులో అన్ని అధునాతన విభాగాలన్నింటినీ ఆయన పరిశీలించారు.