Breaking News

ఇంటింటి సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటింటి సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ లో 90 శాతం లక్ష్యాలను సాధించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కె మాధవీలత శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,42,300 మంది పెన్షన్ లబ్దిదారులు ఉండగా వారిలో ఇంటింటికీ పంపిణి కోసం ప్రత్యేక కేటగిరి పరిధిలోకి వచ్చే వారి కి సంబంధించిన శనివారం రాత్రి 8 గంటల వరకు 67,810 మందికి చెందిన రూ.19.57 కోట్ల కు గానూ 61,002 మందికి రూ.17.62 కోట్ల ను పంపిణి చేశామని తెలిపారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సేవలను వినియోగించడం జరిగిందన్నారు. నేరుగా లబ్దిదారులు ఖాతాలకు నగదు జమ చేయడం లో భాగంగా 1,74,490 మందికి చెందిన రూ.52.35 కోట్లకు గానూ 83,438 మందికి చెందిన రూ.26.03 కొట్లు బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు.

ఇంటింటికీ సామజిక భద్రత పెన్షన్లు పంపిణీ ఇప్పటికే 90 శాతం చేశారని మిగిలిన లక్ష్యాలను ఆదివారం సెలవు రోజున పంపిణి కోసం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు మాధవీలత తెలియ చేశారు . లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదలీ కోసం చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *