పంచ గ్రహ కూటమి

-పంచ గ్రహ కూటమి దోషములు
-జూన్ 6వ తేది గురువారం వైశాఖ అమావాస్య నుండి జూన్ 16వ తేది ఆదివారం జ్యేష్ఠ దశమి వరకు.

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 5 వ తారీకు ఉదయం 04:12 నీ..కి చంద్రుడు వృషభ రాశి లో ప్రవేశం జరిగినప్పటి నుండీ జూన్ 7 వ తారీకు ఉదయం 07:40 వరకు వృషభరాశి లో రవి, చంద్ర, గురు, బుధ, శుక్ర, గ్రహాలతో పంచ గ్రహ కూటమి జరుగబోతోంది. ఈ గ్రహ కూటమిలో రవి, గురువులు గ్రహ యుద్ధంలో ఓడింపబడి వున్నారు. శుక్రుడు అస్తంగత్వం అయ్యి మౌఢ్యం లో వుండడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితికి సమస్యలు కలగడం జరుగుతాయి. గ్రహ కూటములు ఎప్పుడూ దుష్ఫలితాలనే ఇస్తాయని బృహత్ సంహిత వంటి గ్రంథాలలో చెప్పబడింది. అమావాస్య సమయంలో సంభవించబోయే ఈ పంచగ్రహ కూటమి ఎక్కువ ప్రమాదకారి అనే చెప్పొచ్చు.

వృషభ రాశి భూతత్వపు రాశి కనుక కొన్ని ప్రదేశాల్లో భూకంపం సంభవించవచ్చు. వృషభ రాశి భారతదేశపు లగ్నం. ఈ పంచ గ్రహ కూటమి వివిధ రకాల దుస్సంఘటనలకు కారణం అయ్యే సూచనలు వున్నాయి. మత/కుల/వర్గ ఘర్షణలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఢిల్లీ, కశ్మీర్, ముంబై, తూర్పు భారత దేశంలోని రాష్ట్రాల్లో ఎక్కడైనా భూమి కంపించ వచ్చు. స్టాక్ మార్కెట్ లో విపరీతమైన హెచ్చు తగ్గులు వుండొచ్చు. అగ్ని ప్రమాదాలు, విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

మరొక ముఖ్య మైన అంశం : వృషభ రాశి లో కూటమి లో వున్న 5 గ్రహాలు జల తత్వపు రాశైన వృశ్చిక రాశిని వీక్షిస్తారు.
ఈ 5 గ్రహాలతో పాటు మేష రాశిలో వున్న కుజుడు తన అష్టమ దృష్టితో, కుంభ రాశిలో వున్న శని తన దశమ దృష్టితో, మీన రాశిలో వున్న రాహువు తన నవమ దృష్టితో అంటే! మొత్తంగా అన్ని గ్రహాలు వృశ్చిక రాశిపై దృష్టి సారిస్తారు.
దీని వల్ల దక్షిణ భారత దేశంలో అకాల వర్షాలు, వరదలు, జన నష్టం, ఆస్తి నష్టం సంభవించవచ్చు.

అరుదుగా సంభవించే ఈ కూటమి వల్ల కలిగే దుష్ఫలితాల ప్రభావం త మ పై పడకుండా అన్నిరాసులవారు ఎవరికి వారు ఇష్ట దైవ ప్రార్థన గ్రహ జపం పూజ హోమం చేసు కోవాలి. చండీహోమం సప్తశతి పారాయణము మహావిద్యా పారాయణము చాలా మంచిది.

గమనిక: ద్వాదశ రాశుల వారు జూన్ 6 వ తేది తమ తమగృహల్లో ఇది వరకు పోస్ట్ లో ఇచ్చిన అష్టదిక్బంధన తో ఇంటికి రక్షణ చేసుకువాలి అదే మంత్రాన్ని1008, సార్లు జపం చేసుకోవాలి. 3 వారాలు పాటు మాంసాహారం తినకపోవడం చాలా మంచిది వాతావరణం కారణంగా జంతువులు జబ్బు పడతాయి ఆ మాంసము ఆరోగ్యం కి మంచిది కాదు ముఖ్యం గా చేపలు తినే వారు త్వరగా అశ్వస్తతకు గురు అవుతారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారి మూడు లేక నాలుగు వారాలు పాటు గర్భధారణ జరగకుండా జాగ్రత్త పడాలి సంతానమునకు అంగవైకల్యం వచ్చే సూచనలు ఉంటాయి. దూరప్రయా ణాలు చేయకండి మంచిది కాదు. వాయువు ద్వారానే వైరస్ వ్యాపించే రోగాలు ఈ గ్రహ కూటమి ద్వారా సంభవిస్తాయని తెలుస్తున్న పరిణామం.. గ్రహ కూటమి వల్ల ఇవన్నీ ఏర్పడటం లేదు ఇవన్నీ జాగరగబోయే దానికి ఈ కూటమి ఒక ముహూర్తం.. మాత్రమే!అని గ్రహించండి.

నివారణ : హనుమాన్ చాలీసా పారాయణం శీతలా అష్టకం,కవచం స్త్రోత్రం పారాయణం చేసుకోండి. భయపడాల్సిన అవసరం లేదు ఆహారం విషయం లో ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణ తో ఆహార నియమాలు వల్లే తగ్గుతుంది మందులు వల్ల కాదు. దైవానుగ్రహం తప్ప ఎటువంటి వాటికి పరిష్కారం ఉండదు అందుకే ఈ జపం, పూజలు, హోమాలు.

Check Also

గుంటూరులో  అక్టోబర్ 13న ఇండియా పోస్ట్ రన్-2024

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 13న గుంటూరులో ఇండియా పోస్ట్ రన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *