గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ , నాయకులు, కార్యకర్తలు ఇళ్ళు పై జరుగుతున్న హింసాకాండను ప్రజలు గమనిస్తున్నారని అలాగే సాదారణ , ప్రజలు కూడా భయబ్రాంతులకు గురవుతున్నారని మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, సంక్షేమ తో పాటు అభివృద్ధికి వినియోగించుకోవాలే కానీ ప్రత్యర్థి పార్టీ నాయకుల ఇళ్ళ వద్ద అల్లర్లు చేయడానికి కాదని, దారుణమయిన ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉన్నా కూడా ప్రజాస్వామ్యం లో ప్రజా తీర్పుని గౌరవిస్తున్నామని. కృష్ణా జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యవజన విభాగం అధ్యక్షులు మెరుగుమాల కాళి ఓ ప్రకటన లో మీడియా కు తెలిపారు.
మచిలీపట్నం పార్లమెంటు లో గెలిచిన ఏడుగురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు, జనసేన పార్టీ పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరీకి శుభాకాంక్షలు తెలియచేశారు. జిల్లాలో ఒక్క సీట్ కూడా గెలవలేక పోవడం బాధ కలిగించింద అన్నారు. 53వేలు పైచిలుకు మెజారిటీతో గెలిచిన గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము అభినందనలు తెలియచేసారు . కేవలం ఎన్నికలకు 17 నెలలు 11రోజులు ముందు గుడివాడ లో అడుగుపెట్టి అభివృద్ధి అనే అంశం తో గుడివాడ ప్రజల నమ్మకాన్ని రాము గెలుచుకున్నారని అన్నారు.
గుడివాడ అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా సహకరిస్తామని తెలియచేసారు. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కటారి సత్యనారాయణ పేరును కొత్తమున్సిపల్ ఆఫీస్ కు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. గుడివాడ నియోజకవర్గం లో బూత్ ల వారీగా ఓట్ల వివరాలను సేకరించి ఓటమికి కారణాలను సమీక్షిస్తున్నామని రాబోయే రోజుకు ప్రతి కష్టం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులులకు అండగా ఉంటూ త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని నాయకత్వం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి పూర్వవైభవం తీసుకోవచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
Tags gudivada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …