Breaking News

ఆంధ్రరత్న భవనంలో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వర్ధంతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఆంధ్రరత్న భవనంలో స్వాతంత్ర్య సమరయోధుడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వర్ధంతికి ఘననివాళులర్పించారు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు విజయవాడ నగర కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన దుగ్గిరాల వర్ధంతికి ఎపిసిసి ఉపాధ్యక్షులు వి. గురునాధం ముఖ్యఅతిధిగా విచ్చేశారు. దుగ్గిరాల కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జన్మించారని, విదేశాలలో విద్య పూర్తి చేసుకొని గుంటూరు వచ్చి లెక్చరర్ గా ఉద్యోగంలో చేరారని ఆయన తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు పోతురాజు ఏసుదాసు, అన్సారీ, అయ్యప్ప, శివరాం, లీగల్ సెల్ రాష్ట్ర ఛైర్మెన్ డా. జంధ్యాల శాస్త్రి, ఆర్.టి.ఐ. ఛైర్మెన్ పి.వై. కిరణ్, విజయవాడ నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు మీడియా కో-ఆర్డినేటర్ రత్నాకర్, ఉమ్మడి కృష్ణాజిల్లా కాపు సెల్ నాయకుడు అల్లం రాజేష్, కిరణ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని దుగ్గిరాల గోపాల కృష్ణయ్యకు జోహార్లర్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *