విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీ కోర్టు 49 సం గల ఒక వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్షను విధించటం జరిగింది ఇందుకు కారణం, ఈ వ్యక్తి ఒక చిన్న బాలికను బాల్యవివాహము చేసుకొని బలవంతముగా మానభంగము చేసినందులకు విధించబడిన శిక్ష ఇది. మన దేశములోవున్న అన్ని స్వచ్చంద సంస్థలు ఇలాంటి శిక్షలను దేశమంతా అమలువరచవలసినదిగా అభ్యర్ధించటము జరిగినది. ఢిల్లి (POCSO) కొర్టు ఈ వ్యక్తి నుండి 10.5 లక్షల రూపాయలను పరిహారముగా ఇప్పించటము జరిగినది.
వాసవ్య మహిళా మండలి సంకీర్ణ భాగస్వామ్య స్వఛంద సమస్థల ద్వారా బాల్యవివాహలు లేని భారతదేశముగా చేయటకు, మీ యెద్ద నుండి పైన పేర్కొన్న వాటికి దగ్గరగా ఉండే కార్యక్రమ ప్రణాళికలను దేశవ్యాప్తముగా తయారు చేసుకోవాలి. ఇప్పటికి మన దేశములో ఇంకా 2.4 లక్షలకు పైగా విచారణకు నోచుకొని కేసులు ఉన్నాయి. ప్రత్యేక ఢిల్లీ కోర్టు (POCSO) దేశములోనే ఒక ప్రత్యేక మైలురాయిగా నిలచిపోయే తీర్పును ఈ బాల్య వివాహల మరియు మానభంగ కేసులో పైన పేర్కొన్న 49 సంల నిందితునికి కఠినమైన 10సం జైలు శిక్షను మరియు అతనికి 10.5 లక్షల జరిమానాను విధించి ఆ బాలికకు ఇప్పించటము జరిగినది. ఈ బాలిక మానభంగానికి గురి అయినప్పుడు ఈమె వయసు 13 సం లు, అంతే కాకుండా దేశములో ఇటువంటి కేసులు ఇంకా 24 లక్షల వరకు (POCSO) విచారణకు నోచుకొనకుండా వున్నవి. బాల్యవివాహల మరియు మానభంగాల కేనులలో నేరారొవణ జరగటము, నిందితులను గుర్తించటము చాలా అవస్యకతయైయున్నది.వానవ్య మహిళా మండలి, యన్.టి.ఆర్ మరియు కృష్ణా, మిగతా భాగస్వామ్య స్వచ్చంద సంస్థలతో ఒకటిగా కూడి మన దేశాన్ని బాల్య వివాహలు లేని దేశముగా చేయలని (CMFI) మరియు తక్షణమే గౌరవ కోర్టులు చాల వేగమంతముగా నిలచిపోయివున్న కేసులపై (POCSO) తీర్పులను ఆలస్యము చేయకుండా అభగ్యులైన బాలికలకు న్యాయం చేయాలని నేరస్తులకు (CMFI) శిక్షలను విధించాలని దేశవ్యాప్తముగా 200 NGOS 400 జిల్లాలలో ఉద్యమాలు చేస్తున్నాయి. 2030 వ సం కన్నా బాల్య వివాహల కేసులు లేని దేశముగా చేయలి గౌరవ జడ్జి గారైన శ్రీ అంకిత మెహత గారు ఈ కేసు యొక్క పూర్వపరాలను అన్ని కోణములలో నిశితముగా పరిశీలించి శుక్రవారం తీర్పును వెలువరించి 10 సంవత్సరముల జైలు శిక్షను బాల్యవివాహము మరియు మానభంగము కేసునకు సంభందించి అపరాధికి శిక్ష విధించటము జరిగినది, దీనికి అనుగుణముగానే కోర్టు ఆ మైనరు బాలికకు 10.5 లక్షల రూపాయలను నష్టపరిహారముగా ఇప్పించటము జరిగినది. అదేవిధముగా 15000/- రూపాయలను జరిమానగా విధించటము జరిగినది. ఈ 49 సం వ్యక్తి బీహారు రాష్ట్రమునకు చెందినవాడు. ఈ దోషిగా తేలినవ్యక్తి 376 (2) విభాగము క్రింద మరియు భారతియ్య శిక్షాస్మృతికి సంభందించిన విభాగము 6 లో ఉన్న పిల్లల బలవంతపు లైంగిక వేదింపుల నుండి రక్షణ కల్పించటము POCSO చట్టం 2012 మరియు విభాగము 9/10 లో గల బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 తెలియజేస్తుంది.
ఈ తీర్పు బాల్యవివాహల కేసులకు సంభందించి ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. అలాగే సమాజంలో గొప్ప మార్పునకు మరియు జాగ్రత్తకు ఇది ఒక నిర్ణయాత్మక స్థానము కలిగివుంటుంది. మేము ఒక స్వచ్చంద సమస్థగా గౌరవ కోర్టులను బాల్యవివాహలు మరియు మానభంగాల కేసులలో వేగవంతమైన తీర్పులను, శిక్షలను అమలుపరిస్తే నేరస్తుల మరియు వారి ఆలోచన విధానములో సమూలమైన మార్పులు వచ్చి నేరాలు గణనియ్యముగా తగ్గుతాయని వేడుకుంటున్నాము. మేము రాష్ట్ర గవర్నమెంట్ మరియు వారికి సంభందించిన అధికారులతో కలసిమెలసి పనిచేస్తున్నప్పుడు ఈ ఋగ్మతలను తిరుగిరాని విధంగా ఏరిపారివేయటం ఎలా అని అలోచనకు వసై సమాజములో ఉన్న కుటుంబాలకు, వ్యక్తులకు అవగాహన మరియు భరోసా కల్పించటము, ఈ రకమైన కోర్టు తీర్పు ద్వారా నేరస్తునికి వ్యతిరేకముగా మనము చాలా బలము కలిగిన కార్యక్రమాలను సమర్ధవంతముగా అమలు చేయలి అని డాక్టర్ కీర్తి అధ్యక్షులు వానవ్య మహిళా మండలి అన్నారు.
పైన ఉదహరించిన తీర్పు లాయర్లకు, సమాజం హితము కోరే కార్యకర్తలకు అందుబాటులో ఉంటుంది. అలాగే బాల్యవివాహలు లేని భారతావని వుంటుందని (CMFI) స్థాపించిన శ్రీభువన్ రిబ్బు గారు చెప్పినదానిని బట్టి ఈ తీర్పు ఒక మైలురాయిగాను,ఆహ్వనించదగిన తీర్పుగాను అభివర్ణించినారు. బాల్యవివాహలే మానభంగాలకు కారణము అని వీరికి గట్టి నమ్మకము వుంది ఈ చట్టంలో బాల్యవివాహల విషయములో నిర్ణయాత్మకముగా గతములో మాదిరిగా కాకుండా 2030వ సంవత్సరము లోపు బాల్యవివాహలను పూర్తిగా లేకుండా చేయలని లక్షంగా పెట్టుకుంది అని మన గవర్నమెంటు యొక్క లక్షం కూడ భారతదేశాన్ని అభివృద్ధి దేశంగా తీర్చిదిద్దటము, ఇది జరగాలంటే సరిఅయిన భరోసాను, ఉచిత విద్యను 18 సం వరకు ఖచ్చితముగా అందిస్తె బాల్యవివాహలను తొలగించగలము.బాల్యవివాహలు లేని భారతదేశముగా ఉండాలని దేశవ్యాప్తముగా ప్రచారము 2022 సం లోనే గణనియ్యంగా, నిభందనలకు అనుగుణముగా విస్తరించియున్నది. దీనికి కారణము స్వచ్చంద సంస్థల యొక్క నిర్విరామ కృషి మరియు వారి ప్రభావము. 161 స్వచ్చంద సంస్థల భాగ్యస్వామ్యము ద్వారా 17 రాష్ట్రలలో పనిచేస్తునారు, గత సంవత్సరము మన ప్రచారము విరివిగా చేయటము వలన ఇప్పుడు 22 రాష్ట్రలలో ఈ పిల్లల అక్రమరవాణా మరియు లైంగిక వేదింపులు లేకుండా చేయుటకు పని చేస్తు ముఖ్యముగా బాల్యవివాహల నిరోధానికి కృషి చేస్తున్నారు. చాల జిల్లాలలో ఈ బాల్యవివాహలు గణనియ్యముగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించటము జరిగింది. ఈ ప్రకారము వీటి యొక్క ముఖ్యఉద్దేశము మరియు కార్యక్రమప్రణళిక పిల్లల హక్కుల కార్యకర్త భువన్ రిబ్బు ఎక్కువగా విక్రయించబడిన పుస్తకం ‘పిల్లలకు పిల్లలు ఉన్నప్పుడు’ బాల్యవివాహలు అంతరించటానికి చివరి అంకములో ఉన్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము అని ఆమె అన్నారు.