Breaking News

రేపటి దేశ చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం చిన్నారులను బడికి పంపించాలి

-బడి ఈడు పిల్లలను అందరినీ బడిలో చేర్చే బాధ్యత అందరి సమిష్టి బాధ్యత
-బడి ఈడు పిల్లలను పనిలో పెట్టుకుంటే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తప్పవు
-రేపు నెల జూలై 11 వరకు నేను బడికి పోతా కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి బడి ఈడు పిల్లలను గుర్తించే సర్వే, పక్కాగా చేపట్టి బడి ఈడు పిల్లలను అందరినీ బడిలో చేర్చాలి: జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండేలా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, ఈ నెల 15 నుండి రేపు నెల జూలై 11 వరకు జరుగుతున్న ఇంటింటికీ గృహ సందర్శన ద్వారా బడి ఈడు పిల్లల వివరాల సేకరణ, పాఠశాలలో నమోదు కొరకు అన్ని సంబంధిత శాఖలు సమిష్టిగా కృషి చేసి జిల్లాలోని బడిబయటి పిల్లలను అందరినీ బడిలో చేర్పించేలా ప్రణాళికా బద్ధంగా బాధ్యతగా పనిచేయాలని అధికారులను ఆదేశిస్తూ, పిల్లలను పనిలో పెట్టుకుంటే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.

బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన “నేను బడికి పోతా” అనే బడి ఈడు పిల్లలను అందరినీ బడిలో చేర్చే కార్యక్రమం కొరకు జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఈ నెల 15 నుండి రేపు నెల జూలై 11 వరకు ఇంటింటికీ గ్రామ వాలంటీర్లు, పేరెంట్స్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు తిరిగి పిల్లలకు, వారి తల్లి తండ్రులకు అవగాహన కల్పించి బడిఈడు పిల్లలు 6 సం. నుండి 14 సం. ల లోపు వారిని గుర్తించి అందరినీ వారి విద్యార్హత మేరకు సంబంధిత పాఠశాల తరగతుల్లో నమోదు చేసి వారికి విద్యా కానుక కిట్లు అందించాలని, సంబంధిత తరగతి టీచర్లు సదరు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని గుర్తించి సంబంధిత పై అధికారులకు నిర్దేశిత ప్రోఫార్మలో సమర్పించాల్సి ఉంటుందని, జూలై 12 నాటికి తమ గ్రామ, హ్యాబిటేషన్ పరిధిలో బడిబయటి పిల్లలు లేరు అని, అందరూ బడిలో చేర్చడం జరిగిందనీ ధృవీకరించాల్సి ఉంటుందని, సదరు వివరాలు సమర్పించాలని సూచించారు. విద్యా శాఖ, సమగ్ర శిక్షా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, మెప్మా, గ్రామ వార్డు సచివాలయం అధికారులు, రవాణా శాఖ, సంక్షేమ హాస్టళ్ల తదితర శాఖల అధికారులు అందరూ వారి వారి పరిధిలో చక్కగా బాధ్యతలు నిర్వర్తించాలని తెలిపారు. ప్రతి బడి ఈడు పిల్లవాడిని బడిలో చేర్చడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సూచించారు. రేపటి దేశ చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం మన చిన్నారులను ఈ రోజు నుండే బడికి పంపుదాం, మన అమ్మాయిలను చదువుకోనిద్దాం, జీవితంలో ఎదగనిద్దామని సూచించారు. ప్రతి చిన్నారిని బడికి పంపించడంలో జిల్లా యంత్రాంగానికి తల్లిదండ్రులు సహకరించాలన్నారు. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం – 2009 సంబంధించి 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలని, వివిధ శాఖల సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బాల్య వివాహాలు జరగకుండా అవగాహన కల్పించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న చైల్డ్ లేబర్ రెస్క్యూ డ్రైవ్ లో బాల కార్మికులుగా గుర్తించిన పిల్లలను తిరిగి లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు విద్యాశాఖ అధికారులతో మాట్లాడి సంబంధిత బాలలను తిరిగి స్కూల్లో లేదా బ్రిడ్జి స్కూల్ నందు వారి విద్యార్హత మేరకు చేర్పించాలని ఆదేశించారు.

బిసి, ఎస్సీ, ఎస్టీ తదితర సంక్షేమ హాస్టల్ లలో పిల్లల నమోదుకు నిబంధనల మేరకు చర్యలు ఉండాలని, రక్షిత త్రాగు నీరు, నాణ్యమైన ఆహారం పిల్లలకు అందేలా, వంటగది, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ వర్షాకాలంలో కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి శేఖర్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని జయలక్ష్మి, జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారిని సుశీల దేవి, గిరిజన సంక్షేమ అధికారిని, ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మ రాధమ్మ, సమగ్ర శిక్షా అధికారులు ఎన్సిఎల్పీ తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *