-జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
భూసేకరణ అంశాలపై కోర్టులో పెండింగ్ అంశాలపై పూర్తి స్థాయిలో పరిష్కార దిశగా త్వరితగతిన అధికారులు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. ల్యాండ్ అక్విజిషన్లో కోర్టు కేసులు ప్రభుత్వానికి అనుకూలంగా పరిష్కారమయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు.
బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు కలెక్టర్ ల్యాండ్ అక్విజేషన్ అంశాలకు సంబంధించిన కోర్టు కేసులపై సంబంధిత అధికారులు త్వరిత గతిన సకాలంలో తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎలాంటి అలసత్వం ఉండరాదని అన్నారు.సదరు కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేవిధంగా తీసుకోవలసిన చర్యల గురించి ఏ.పి.ఐ.ఐ.సి, రెవెన్యూ, కలెక్టరేట్ లీగల్ వింగ్ మరియు శ్రీ సిటీ ప్రతినిధుల తో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందులో హైకోర్టులో ప్రధానంగా కేసు నమోదు అయినప్పుడు కౌంటర్ దాఖలు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సమీక్షించి సూచనలు ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన కేసుల్లో తప్పకుండా రివ్యూ పిటిషన్ వేయడం, అవసరమైతే సుప్రీంకోర్టులో ఎస్.ఎల్.పి దాఖలు చేయడం వంటి చర్యలు తీసుకోవలసినదిగా సూచించారు. తహసీల్దార్ కౌంటరు ఫైలు చేసేటప్పుడు కలెక్టర్ వారి నోటీసుకు కూడా తీసుకెళ్లాలని సూచించారు. ఇలాంటి అన్ని కేసుల్లో అప్రమత్తంగా వ్యవహరించి ప్రభుత్వ లాయర్లతో సమన్వయం చేసుకొని సరైన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో లీగల్ సెల్ ఎస్డిసి మురళి, జోనల్ మేనేజర్ ఏపీఐఐసీ తిరుపతి చంద్రశేఖర్ , ఏపీఐఐసీ నెల్లూరు జోనల్ మేనేజర్ విజయరత్నం, తిరుపతి ఏపీఐఐసీ డీఈఎం జవహర్ బాబు, భగవాన్ శ్రీ సిటీ ప్రతినిధులు రామచంద్ర రెడ్డి, మరియు కలెక్టరేట్ లీగల్ సెల్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News