Breaking News

తెలంగాణ ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరిన టీఎన్జీవో సంఘం

వెలగపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంద్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు కమల నాధన్ కమిటీ ద్వారా ఆంద్రప్రదేశ్ కు కేటాయించిన 144 మంది ఉద్యోగులను తిరిగి తమ రాష్ట్రా నికి పంప వలసినదిగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ గత శుక్రవారం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కోరినందున వెంటనే తమ ఉద్యోగులను తెలంగాణకు పంపించాలని టీఎన్జీవో సంఘం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ముఖ్యమంత్రి కార్యదర్శిని బుధవారం అమరావతి లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో కలిసి విజ్ఞప్తి చేసినట్లు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ తెలిపారు తెలంగాణా రాష్ట్రం నుంచి అమరావతికి వచ్చిన వాళ్ళు TNGOs కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్,ప్రధాన కార్యదర్శి ముజీ హుస్సేన్ అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ఎం.సత్యనా రాయణ గౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాస రావు,నగర శాఖ అధ్యక్షు లు కట్కూరి శ్రీకాంత్,ఉపాధ్యక్షులు నర్సింహా రెడ్డి, ఈ.కొండల్ రెడ్డి కార్యదర్శి చంద్రశేఖర్ (చందు), మహేందర్, ఖాజా, రజనీ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *