Breaking News

సమిశ్రగూడెంలో 398 విద్యార్థులకు విద్యా కిడ్స్ పంపిణీ

-ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరినందుకు విద్యే ఆయుధం
-ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అత్యున్నత స్థాయి ప్రమాణ విద్య అందించడమే ధ్యేయం
– మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ  తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానములో ఉండేందుకు పాఠశాల విద్య పునాది ఇస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక  సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బుధవారం సమీశ్రగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో  పాల్గొని విద్యార్థిని, విద్యార్థినీ విద్యార్థులకు  విద్య కిడ్స్ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి 398 మంది విద్యార్థులకు విద్యా కిడ్స్(బ్యాగ్, బుక్స్, బెల్ట్, షూ) పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందులు దుర్గేష్ మాట్లాడుతూ  పాఠశాల దశలోనే విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తుందన్నారు.   ప్రతి పేదవానికి విద్య చేరువ చేయాలని సంకల్పంతో  రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు.  ముఖ్యంగా బాలికలు అందరూ తప్పనిసరిగా విద్యాబోధన చేయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ బాలికలు విద్యను వదలకూడదని వారి భవిష్యత్తులో ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్లడానికి విద్య ఎంతో ఉపకరిస్తుందని  ఆయన అన్నారు. అందుకోసం బాలికలకు ప్రత్యేకమైన పాఠశాలలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.   ఈరోజు బాలబాలికలు అందరూ చక్కగా రెండు జడలు వేసుకుని సాంప్రదాయబద్ధంగా కనిపించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మంత్రి అన్నారు. విద్యార్థులు జీవితంలో ఎదగాలనే ఆలోచనతో స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం అన్నారు. ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైన  ఆత్మనూన్యతకు లోను కాకుండా అపజయాల నుంచి పాఠాలను నేర్చుకోవడం ద్వారా సమర్థవంతంగా  ఎదుర్కోవాలన్నారు. చదువుతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థుల తమలో  అంతర్లీనంగా నిగూడమైన క్రీడలు, కళల పట్ల ఆసక్తి చూపితే జీవితంలో వారి ఎదుగుదలకు ఎంతో అని చేకూర్చుతాయి అన్నారు. స్కూలు అనేది పవిత్రమైన  దేవాలయమని  ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవించాలని  అప్పుడే మనం విజయాన్ని సాధిస్తామన్నారు. పాఠశాలలో బాలికలు డ్రాప్ అవుట్స్ లేకుండా అధికారు లందరూ కృషి చేయాలి అన్నారు.   బాలికలకు పాఠశాలల్లో మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడమే కాకుండా అవి మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. విద్యార్థిని, విద్యార్థులు ఆటలు ఆడుకోవడానికి హైస్కూల్లో మంచి క్రీడాస్థలం ఉన్నదని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఆడుకోవడానికి అనువుగా క్రీడా స్థలాన్ని  మెరక చేయించి గడ్డి వంటి లేకుండా స్థలాన్ని చదును చేయించవలసినదిగా ఆయన అధికారులకు సూచించారు. ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయుల కంటే ప్రభుత్వ పాఠశాల లో బోధించే ఉపాధ్యాయులు అన్ని విధాల విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులే ఉంటారని ఆయన అన్నారు.  రాష్ట్రం ప్రభుత్వం ప్రతి విద్యార్థిని బావి పౌరులుగా తీర్చిదిద్దే కృత నిశ్చయంతో ఉందని,  పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా ప్రభుత్వ యంత్రాంగం తప్పక కృషి చేస్తుం దని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సమిశ్ర గూడెం గ్రామ సర్పంచి దేశాభక్తుల జోత్స్న ప్రియాంక,  నిడదవోలు మండల విద్యాశాఖ అధికారి కె.వి గణేష్, నిడదవోలు ఎంపీడీవో జేఏ ఝాన్సీ, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు విడి దివాకర్, బిజెపి నాయకులు,  స్థానిక నాయకులు , అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *