అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హజ్ యాత్రను ముగించుకొని ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చిన హజ్ యాత్రికులను గన్నవరం ఎయిర్పోర్ట్ నందు వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ హాజయాత్రికులకు ఎటువంటి కష్టం రాకుండా ఎటువంటి ఆటంకాలు రాకుండా వారికి కావాల్సిన సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ఈరోజు హజ్ యాత్రను ముగించుకొని విజయవంతంగా తిరిగి వచ్చిన హజ్ యాత్రికులకు మంత్రి ఫరూక్ ఘనంగా వారికి స్వాగతం పలికారు .
ఈ సందర్భంగా హజ్ యాత్రికులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని వారికి మా హజ్ యాత్రికుల కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో గుంటూరు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ హర్షవర్ధన్ ఐఏఎస్, హజ్ కమిటీ సీఈవో అబ్దుల్ ఖాదర్, టిడిపి మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్, రాస్ట్రాప్రదన కార్యదర్శి ఎండి Fatullah, ముస్లిం మత పెద్దలు మౌలానా హుస్సేన్, ముఫ్తీ ఫారూఖ్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ, తదితరులు పాల్గొన్నారు.