ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆషాడ మాసం సందర్బంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివార్ల దేవస్థానం, శ్రీకాళహస్తి నుండి ఇంద్రకీలాద్రి పై నున్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించుటకు గాను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల శ్రీధర్ మరియు శ్రీ కాళహస్తి ఆలయ ఉప కార్యనిర్వాహణాధికారి ఎన్ ఆర్ కృష్ణా రెడ్డి మరియు అధికారులు అమ్మవారికి ఆషాడ సారె సమర్పించుటకు విచ్చేయగా వీరికి దుర్గ గుడి ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేసినారు. అనంతరం శ్రీకాళహస్తి శాసనసభ్యులు వారు దుర్గ గుడి కార్యనిర్వాహనాధికారి కి శ్రీ కాళహస్తి దేవస్థానం శేషవస్త్రం, ప్రసాదములు మరియు చిత్రపటములు అందజేశారు.
Tags indrakiladri
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …