Breaking News

దాతృత్వాన్ని చాటుకున్న ఆర్యవైశ్య సేవా సంఘం గొల్లపూడి… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్యవైశ్య సేవా సంఘం, గొల్లపూడి ఆదివారం కేకే యూరో కైన్డ్స్ స్కూల్ నందు  కరోనా కాటుకు గురై ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న జక్కా పవన్ చందు. అగ్రికల్చర్ బి డిఎస్సీ విద్యార్థి కుటుంబానికి  21,000 (ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు) రూపాయల బ్యాంకు చెక్కు రూపంలో ఆర్థిక సాయం అందచేశారు. ఈ కార్యక్రమాని సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కొవిడ్ నిబంధనల ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సేవా సంఘం, గొల్లపూడి,అధ్యక్షులు తడవర్తి సుబ్రహ్మణ్యేశ్వర రావు మాట్లాడుతూ కరోనా కాటుకు గురైన తన కుటుంబాన్ని  ఆర్థికంగా సాయం చేసి ఆదుకోవాలని సహాయం చేయమని విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో నివసిస్తున్న జక్కా ప్రవీణ్ అగ్రికల్చర్ బిఎస్సి చదువుతున్న విద్యార్థి  ఆర్యవైశ్య సేవా సంఘం, గొల్లపూడిని అభ్యర్థించగా సహృదయంతో సంఘ సభ్యులు అందరి సమిష్టి కృషితో ఈ సాయం అందచేశామన్నారు. ఆర్యవైశ్య సేవా సంఘం, గొల్లపూడి ఆధ్వర్యంలో కుల మతాలకి అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, కరోనా విపత్కర పరిస్థితులవల్ల ప్రస్తుతం ఆపామని, మరిన్ని సేవా కార్యక్రమాలు ముందుముందు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లా భుజంగరావు. పులవర్తి నందకుమార్. గుడివాడ ఆదిశేషు గుప్త. మద్దాలి శ్రీనివాస్ కుమార్. కొలిశెట్టి శ్రీనివాసరావు. పోకూరి బాలగంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *