Breaking News

ఆదర్శ మానవతామూర్తి గోగినేని… 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు కుటుంబంలో జన్మించి ప్రజా సేవే లక్ష్యంగా, విద్యా, ఆధ్యాత్మిక సేవారంగాలలో గుర్తింపు తెచ్చుకుని అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నమానవతా మూర్తి కీ॥శే॥ గోగినేని నాగేశ్వరరావు. రాష్ట్రంలో కీ॥శే॥ గోగినేని నాగేశ్వరరావు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. రాష్ట్ర స్థాయిలో స్వగ్రామం నడింపల్లికి గుర్తింపు తెచ్చి అన్ని విధాలా అభివృద్ధికి కృషి చేసారు. స్వగ్రామం నడింపల్లి గ్రామాభివృద్ధి కాకుండా చుట్టు ప్రక్కల గ్రామాలాభివృద్ధికి పాటు పడ్డారు. గ్రామ స్థాయిలో అందరు పిల్లలు చదువుకోవాలని వారికోసం ఎంతో కృషి చేశారు.రైతు అన్నివిధాలా నూతన విధానాలు ద్వారా ఎలా వ్యవసాయం చేసు కొని తన కష్టంకి తగ్గ ప్రతిఫలం పొందాలో ఎప్పటికప్పుడు తెలుసుకొని వారికి చెప్పే రైతు బిడ్డ. విద్యార్థులు పుస్తకపఠనం ద్వారా విజ్ఞానం పెంచుకో వచ్చనే నిత్యం చెప్పే పుస్తక భాండాగారం అయన. గ్రామంలో ఉన్నత మునసుబు పదవిలో వుండి కూడా ఎప్పుడూ అధికార దర్పం చూపని ఆదర్శమూర్తి. ఎప్పటి నుండే యోగ విలువ తెలిసిన యోగీశ్వరుడు. తనకు తెలిసిన విద్యను అందరికి నేర్పి, తన దగ్గరవున్న దానితో చేతనైనంతలో సాయం చేసిన దాత.

అయన ఎందరికో చేసిన సాయాలు తెలిసిన వాటికన్నా తెలియనివి ఎన్నో వున్నాయని, ఈయన లేని లోటు తమ గ్రామానికే కాదు చుట్టుప్రక్కల గ్రామాలకు తీరని లోటని, ఎవరికి కష్టం వచ్చినా ఏ సమయంలోనైనా పిలవగానే పలికి నిత్యం అందుబాటులో వుండి ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే దేవుడులాంటి మనిషి అని ఆయనతోపాటు చివరి దాకా ప్రయాణించిన నిజాంపట్నం ధర్మారావు జ్ఞప్తికి తెచ్చుకుంటూ తెలిపారు. దేనికి ప్రతిఫలం ఆశించని మహామనిషి, ఎంతవున్నా సింపుల్‌ సిటీని ఎక్కువగా ఇష్టపడి, సాంప్రదాయ విలువలకి, సాంప్రదాయ దుస్తులకు వన్నె తెచ్చిన గాంధేయ వాది… ఆదర్శనీయుడు మన గోగినేని నాగేశ్వరరావు. అయన భౌతికంగా దూర మైనా అయన చేసిన మంచి పనులు కలకాలం గుర్తుంటాయి.

 

Check Also

సమాజ సేవలో స్వచ్ఛంధ సంస్థలు భాగస్వామ్యం కావాలి

-కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ లో “మదర్ థెరీసా చారిటబుల్ సొసైటి”, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *