-రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బడ్జెట్ ముఖ్యాంశాలు పై మీడియా సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైల్వేలకు సంబందించిన కేటాయింపులతో కూడిన కేంద్ర బడ్జెట్‌ను 23 జూలై 2024న పార్లమెంట్‌లో సమర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వేలు, సమాచార- ప్రసార , ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ నుండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల ముఖ్యాంశాలపై ఈరోజు అనగా జులై 24 , 2024న వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ను నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మరియు ఇతర సీనియర్ రైల్వే కూడా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి గాను భారతీయ రైల్వేలకు రూ.2,62,000 కోట్లు కేటాయించారని తెలిపారు. రైల్వేలను ప్రపంచ స్థాయికి చేర్చడంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. రైల్వేలో భద్రతకు సంబంధిత కార్యకలాపాలకు అధిక మొత్తంలో రూ.1.9 లక్షల కోట్లు కేటాయించారని తెలిపారు.
రైల్వే బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
అశ్విని వైష్ణవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ మొత్తంలో 2024-25 సంవత్సరానికిగాను రూ.9,151 కోట్లు కేటాయించారని తెలియజేశారు. 2009-14 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వార్షిక సగటు బడ్జెట్ వ్యయం రూ. 886 కోట్లు. 2009-14 మధ్య కాలంలో జరిగిన సగటు కేటాయింపుల కంటే ప్రస్తుత సంవత్సరం కేటాయింపులు దాదాపు పది రెట్లు ఎక్కువగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులు నిరంతరాయంగా పెరుగుతున్నాయని ఆయన చెప్పారు.
గౌరవ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల (కొత్త ట్రాక్‌లు) పనులు మొత్తం వ్యయం రూ. 73,743 కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్ లో రైల్వే నెట్‌వర్క్ 100% విద్యుదీకరించబడిందని తెలియజేసారు. 2009-2014 లో కేవలం 73 కిలోమీటర్ల ట్రాక్ వేయగా గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సగటున సంవత్సరానికి 151 కిలోమీటర్ల మేర నూతన ట్రాక్ వేశామని చెప్పారు మరియు గత పదేళ్లలో 743 ఆర్ఓ బి లు , ఆర్ యూ బి లు నిర్మించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 73 రైల్వే స్టేషన్‌లను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద పునరాభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు.
73 స్టేషన్లను అమృత్ స్టేషన్‌లుగా అభివృద్ధి చేయనున్నారు
ఆదోని, అనకాపల్లి, అనంతపురం, అనపర్తి, అరకు, బాపట్ల, భీమవరం టౌన్, బొబ్బిలి జంక్షన్, చీపురుపల్లి, చీరాల, చిత్తూరు, కడప, కుంబం, ధర్మవరం, ధోనే, దొన, దొనకొండ, ఈల దొనకొండ, ఈ. గిద్దలూరు, గూటి, గుడివాడ, గూడూరు, గుణదల, గుంటూరు, హిందూపూర్, ఇచ్ఛాపురం, కదిరి, కాకినాడ టౌన్ జంక్షన్, కొత్తవలస జంక్షన్, కుప్పం, కర్నూలు నగరం, మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లె రోడ్, మంగళగిరి, మంత్రాలయం జె రోడ్, మార్కపూర్ రోడ్డు , నడికుడి జంక్షన్, నంద్యాల , నాంకుపూర్ జె. , నరసపూర్ , నరసరావుపేట, నౌపడ జం, నెల్లూరు, నిడదవోలు జం, ఒంగోలు, పాకాల జంక్షన్, పలాస, పార్వతీపురం, పిడుగురాళ్ల, పీలేరు, రాజమండ్రి, రాజంపేట, రాయనపాడు, రేణిగుంట, రేపల్లె, సామర్లకోట, సత్తెనపల్లె, సత్యసాయి ప్రశాంతి నిలయం , సింహచలం, సింగరాయి కొండ, శ్రీ కాళహస్తి , శ్రీకాకుళం రోడ్డు సూళ్లూరుపేట , తాడేపల్లిగూడెం, తాడిపత్రి,తెనాలి, తిరుపతి, తుని, విజయవాడ, వినుకొండ, , విశాఖపట్నం, విజయనగరం.