Breaking News

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్  బుధవారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి  నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్ ని సత్కరించి, కూరగాయలతో కూడిన బొకే అందచేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్ళే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఆ దేశంలో ఉన్న విద్యావకాశాలు, విద్యా సంస్థల వివరాలను తెలియచేసేందుకు తగిన గైడెన్స్ అందించాలని ఈ చర్చల్లో పవన్ కళ్యాణ్  ప్రస్తావించారు. అందుకు ఆస్ట్రేలియా హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ సిలై జాకి, ఆస్ట్రేలియా హై కమిషన్ ఎకనామిక్ కౌన్సిలర్ జూలియన్ స్టోర్మ్, ఆస్ట్రేలియా హై కమిషన్ అగ్రికల్చర్ కౌన్సిలర్ కిరణ్ కరమిల్ పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *