అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి నదిలో గల్లంతైన యువకుడి కుటుంబానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, గంటిపెదపూడి వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో పి.గన్నవరంనకు చెందిన విజయ్ అనే యవకుడు గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న సీఎం..విజయ్ కుటుంబానికి రూ.5 లక్షలు సాయంగా ప్రకటించారు. నదిలో వరద ఉధృతి తగ్గేంత వరకు లంక గ్రామాల ప్రజలు, గోదావరి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.
Tags AMARAVARTHI
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …