Breaking News

పోలీస్ శాఖ తరపున అమ్మవారికి సారె సమర్పించిన నగర సిపి SV రాజశేఖర్ బాబు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజున విజయవాడ నగర పోలిసు శాఖ వారి తరుపున శ్రీ కనకదుర్గా అమ్మవారికి పవిత్ర సారె సమర్పించుటకు గాను  విజయవాడ నగర పొలిసు కమీషనరు SV రాజశేఖర్ బాబు, IPS దంపతుల వారు పోలీస్ శాఖ అధికారులు మరియు సిబ్బంది, వారి కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కే ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి పోలీసుశాఖ తరపున అమ్మవారికి పవిత్ర సారె సమర్పించడం జరిగింది. అనంతరం ఆలయ వేదపండితులు, అర్చకులు వీరికి వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం, చిత్రపటం అందజేసినారు. ఈ సందర్బంగా పోలీసు కమీషనర్ వారు ఆలయ కార్యనిర్వాహణాధికారి కె.ఎస్ రామరావు ని దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ తో పాటు డి.సి.పి.లు గౌతమి శాలి, ఐ.పి.యస్, ఉదయరాణి ఐ.పి.యస్, హరి కృష్ణ, అడిషినల్ డి.సి.పి.లు, ఏ.సి.పి.లు, పశ్చిమ ఏసిపి మురళీ కృష్ణ రెడ్డి, I టౌన్ సీఐ దుర్గ శేఖర్ రెడ్డి, ఎస్ఐ సతీష్, రమ్య, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *