Breaking News

ఇంటర్ విద్య అర్హతతో ఇండియన్ నేవీలో 742 పోస్టులకు.. దరఖాస్తు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ నేవీలో ఉద్యోగం చేయాలని కోరుకుంటున్న వారికి శుభవార్త. నౌకాదళం 741 ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐటీఐ, డిప్లొమా, ఇంటర్ చదవినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ పరీక్షతో ఈ ఉద్యో గాలు భర్తీ చేయనున్నారు. గ్రూప్ బి, గ్రూప్ సి విభాగా ల్లో ఈ పోస్టులున్నాయి. ఈ నేవీ రిక్రూట్ మెంట్ కు ఎంపిక అయిన వారు చార్ట్ మ్యాన్, డ్రాఫ్ట్స్ మ్యాన్, ట్రేడ్ మ్యాన్ మేట్, ఫైర్ మ్యాన్ హోదాతో విధులు నిర్వహించాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇవన్నీ కూడా సాంకేతిక సేవలకు చెంది ఉద్యోగాలే. అభ్యర్థులకు రాతపరీక్ష, వైద్య పరీక్షలు చేసి, అర్హులను ఉద్యోగంలోకి తీసుకోనున్నారు. దేశంలో ఉన్న నేవీ కేంద్రాల్లో వీరంతా విధులు నిర్వహిం చాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీలోకా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవా ల్సిఉంటుంది. ఇండియన్ నేవీ ఈ రిక్రూట్ మెంట్ ద్వారా జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ బి, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రి యల్ , నాన్ మినిస్టీరియల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.

ఛార్జ్ మ్యాన్ -1 పోస్టులు, చార్జ్ మ్యాన్ -10 పోస్టులు, ఛార్జ్ మ్యాన్ -18 పోస్టులు, సైంటిఫిక్ అసిస్టెంట్ -4 పోస్టులు ఇండియన్ నేవీ ఈ రిక్రూట్ మెంట్ ద్వారా జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్ పోస్టులను కూడా భర్తీ చేస్తుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *