సీతానగరం (రాపాక), నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి నది వరద ఉధృతి ప్రభావం కారణంగా ముంపుకు గురైన పంట పొలాల రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ, కోఆపరేషన్, మార్కెటింగ్, పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు. అన్నారు. ఆదివారం సాయంత్రం సీతానగరం మండలం రాపాక గ్రామంలో మంత్రి అచ్చం నాయుడు గోదావరి ఉధృతి కారణంగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ లు వున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నాయుడు మాట్లాడుతూ రాష్ర్ట వ్యాప్తంగా పంట నష్టం అంచనా వెయ్యడం జరుగుతుందని , ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో పంట నష్ట నివారణా కోసం కొత్త వంగడాలు సృష్టిస్తామన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ఏటి గట్ల పటిష్టతకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. స్థానిక రైతులు మంత్రికి వివరిస్తూ గోదావరి వరద సమయంలో ప్రతి ఏటా ఈ ప్రాంతం లోని పంట పొలాలు ముంపుకు గురవుతున్నాయని, దీనివలన రైతులు పెట్టుబడులు నష్టపోతున్నామని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి కింజారపు అచ్చం నాయుడు మాట్లాడుతూ భారీ వర్షాలు వరద కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఈ ప్రాంతం ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మంత్రికి వివరిస్తూ వర్షాలతో పాటు ప్రతి ఏడాది గోదావరి ప్రభావం చేత నీటిమట్టం పెరగడం వలన పొలాల్లో ఉన్న నీరు గోదావరిలో మార్గం లేక గురవుతున్నా యన్నారు. అదేవిధంగా సీతానగరం మండలంలో 13 వేల ఎకరాల్లో పంట వెయ్యగా సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో వరి, 300 ఎకరాల్లో కూరగాయలు పంటల తోటలు ముంపు కి గురయ్యాయని మంత్రికి వివరించారు
స్థానిక శాసనసభ్యులు భారీ వర్షాలు వల్ల తనకు మండలంలోని పంట పొలాలు నీట మునుగుతున్నాయని అదే సమయంలో గోదావరి నాది లోనికి వర్షపు నీరు వెళ్లే పరిస్థితి లేదని ఈ ప్రాంతంలోని తొర్రేడు వద్ద రివర్స్ పంపింగ్ ప్రాజెక్టును నిర్మిస్తే ముంపు నివారణ సాధ్యమవుతుందని వివరించారు. పంట నష్టాలు అంచనాలు అనంతరం నష్టపోయిన ప్రతి రైతు పంట నష్ట హరిహరాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మంత్రి రైతులకు హామీ ఇచ్చారు.
మంత్రి వెంట రాజానగరం శాసన సభ్యులు బత్తిన బలరామకృష్ణ , వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్, ఆర్డీవో చైత్ర వర్షిణి, వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు బత్తిన వెంకట లక్ష్మీ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News