విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి కార్యక్రమం ఈరోజు ఉదయం రాష్ర్ట కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బ్రహ్మానందరెడ్డి రాష్ర్ట ముఖ్యమంత్రిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గా దేశానికి, రాష్ట్రానికి యెనలేని సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహారసెట్టి నరసింహరావు, వి.గురునాధం, అన్సారీ, ఖుర్షిదా, బేగ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News