Breaking News

దళితులకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు చేపట్టండి

-సాంఘీక సంక్షేమ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్థికంగా అత్యంత వెనుకబాటులో ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సోషల్ వెల్ఫేర్ శాఖపై ముఖ్యమంత్రి సచివాలయంలో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా శాఖ పనితీరు, వివిధ పథకాల అమలుపై అడిగి తెలుసుకున్నారు. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిథి, సివిల్ సర్వీస్ శిక్షణ కోసం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం, బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్, చంద్రన్న పెళ్లికానుక వంటి పథకాల ద్వారా వేల కుటుంబాలకు లబ్ది చేకూరిందని…అయితే తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాలను నీరుగార్చిందని సిఎం అన్నారు. బడుగు, బలహీన వర్గాలను ఆర్థికంగా నిలబెట్టేందుకు ఉపయోగపడే, వారిని పేదరికం నుంచి బయటపడేసే పథకాలను రద్దు చేయడం వల్ల ఆ వర్గానికి తీరిని నష్టం జరిగిందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సోషల్ వెల్ఫేర్ శాఖకు కేటాయాంచిన నిధుల్లో 83 శాతం ఖర్చు చేస్తే….వైసీపీ ప్రభుత్వంలో కేవలం 67 శాతం మాత్రమే నిధులు ఖర్చు చేశారని అధికారులు వివరించారు. రోజూవారీ కష్టంపై బతికే, అత్యంత పేదరికంతో ఉండే ఈ వర్గానికి మళ్లీ ఊతంగా నిలవాల్సిన అవసరం ఉందని….వారిని పేదరికం నుంచి బయట పడేసేందుకు అవసరమైన కార్యక్రమాలు రూపొందించాలని సిఎం అన్నారు. విద్య, ఉపాధి అవకాశాల ద్వారా వారి జీవితాల్లో మార్పులు తేవచ్చని సిఎం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, అధికారులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *