Breaking News

గనులు, అబ్కారీ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గనులు, అబ్కారీ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం ఉన్నత స్థాయు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఛాంబర్‌లో ఎక్సైజ్, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా, ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్ కుమార్‌లతో విభిన్న అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు, జిల్లాల వారీగా ఇసుక లభ్యత తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రతి జిల్లా లోనూ డిమాండ్ మేరకు ఇసుక లభించేలా సమన్వయం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను మించి ఎక్కడా వసూళ్లకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్సైజ్, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలవుతున్న పరిస్థితులను వివరించారు. కార్యక్రమంలో ఆబ్కారీ , గనుల శాఖ ముఖ్య అధికారులు దేవకుమార్ , అనుసూయా దేవి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *