Breaking News

21వ పశుగణనపై జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం

-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీమతి పి. ప్రశాంతి వారి చేతులమీదుగా జరిగిన 21వ అఖిల భారత పశు గణన కార్యక్రమము గోడ ప్రతిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో నందు జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా.టి, శ్రీనివాసరావు, డి.ఆర్.ఓ., నరసింహులు, రాజమహేంద్రవరం డివిజన్ పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డా. మక్కెన వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, శిక్షణా కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. శిక్షణలో పాల్గొన్న వారందరూ కొత్త సాఫ్ట్ వేర్ తో తమను తాము పరిచయం చేసుకోవాలన్నారు . జిల్లాలో చేపట్టే రాబోయే పశువుల గణనను అంకితభావంతో మరియు ఖచ్చితత్వంతో పూర్తి చేయాలన్నారు. మొత్తం వివరాలను నిర్దేశించిన సమయ పాలనలో సమర్పించాలని ఆయన కోరారు. ది.01.09.2024 నుండి 31.12.2024 వరకు 21వ అఖిల భారత పశు గణన కార్యక్రమము చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ కార్యక్రమము లో భాగముగా సంబంధిత ఎన్యూమరేటర్లు ప్రతీ ఇంటికీ వెళ్లి పశు సంపద వివరములను సేకరించిన పిదప సేకరణ జరిగినట్లుగా ఒక స్టికర్ ను ఆ ఇంటి గుమ్మం పై భాగములో కుడి వైపున అతికించాలని డి ఎ హెచ్ శ్రీనివాస రావు తెలిపారు.

తేదీ 06.08.2024 నుండి 09.08.2024 వరకు జరిగే , 21 వ అఖిల భారత పశు గణన శిక్షణా కార్యక్రమము లో భాగముగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో గల జిల్లా పశుసంవర్ధక శాఖ సమావేశం మందిరం నందు జరిగిన జిల్లా స్థాయి పశు గణన శిక్షణా కార్యక్రమం నందు అనపర్తి, బిక్కవోలు, కడియం, రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం అర్బన్, గోపాలపురం, తాళ్ళపూడి మండలాల నుండి ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. టి. శ్రీనివాసరావు అధ్యక్షతన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఎన్యుమరేటర్లను స్వాగతించారు. పశు గణన లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రతీ ఇంటికీ వెళ్ళి ఖచ్చితమైన పశుగణన చేయాలని ఉన్నది ఉన్నట్లు గా ఎంటర్ చేయాలని తెలిపారు. ఒంగోలు జాతి పశువులు మరియు నెల్లూరు జాతి గొర్రెలు వంటి పశుసంపదలో ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని కొనియాడారు. జిల్లాలో 1.16 లక్షల కుటుంబాలు ఈ రంగంలో నిమగ్నమై ఉన్నాయని, జంతు సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో పశుగణన కొరకు అందరూ పని చేయాలని కోరారు, పశు గణన ద్వారా వచ్చే పశు సంపద వివరముల ఆధారముగా దేశ స్థూల ఉత్పత్తి అంచనా తయారీ…. తద్వారా భారత దేశ పశు సంపదకు తగిన బడ్జెట్ కేటాయింపులు మరియు పధకాల రూపకల్పన చేయడం జరుగును కాబట్టి, సంపూర్ణమైన, సవివరమైన పశుగణన చేయాలని తెలిపారు.

రాజమహేంద్రవరం డివిజన్ పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డా. మక్కెన వెంకటేశ్వర్లు కీలకోపన్యాసం చేస్తూ, ఖచ్చితమైన వివరాల సేకరణ మరియు ఆధునాతన సాఫ్ట్ వేర్ వినియోగం గురించి నొక్కి చెప్పారు.

జిల్లా నోడల్ అధికారి డా. అయిరెడ్డి వీరప్రసన్నకుమార్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఎన్యుమరేటర్లు అందరికీ వివరముగా 21వ పశుగణన ఆప్ పై పూర్తి అవగాహన కల్పిస్తూ సమగ్ర శిక్షణ ఇచ్చారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *