గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర ఇంచార్జి కమిషనర్ గా అనతికాలంలోనే అందరి మన్ననలను హరికృష్ణ పొందారని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. నగర కమిషనర్(ఎఫ్ఏసి) గా రిలీవ్ అవుతున్న ఎస్.హరికృష్ణ అభినందన సభ మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గుంటూరు నగర ఇంచార్జి కమిషనర్ గా 14 రోజుల అనతి కాలంలోనే ఎస్.హరికృష్ణ నగర ప్రజల, అధికారుల మన్ననలను పొందారన్నారు. నగర ప్రజల సమస్యలను తమ దృష్టికి తెచ్చిన వెంటనే వాటిని పాజిటివ్ ఆలోచనతో పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. పెండింగ్ లో ఉన్న అనేక ఫైల్స్ ని అతి తక్కువ కాలంలో పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల కూడా ఎంతో సానుకూలంగా ఉదార స్వభావంతో స్పందించారన్నారు.
డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ జిఎంసి కమిషనర్ గా పని చేసిన తక్కువ కాలంలోనే గుంటూరు నగరంలో పలు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. డిప్యూటీ మేయర్ షేక్ సజిలా మాట్లాడుతూ ప్రజల సమస్యల పట్ల తమ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే తక్షణ స్పందన కల్గిన హరికృష్ణ రానున్న కాలంలో గుంటూరు నగర కమిషనర్ గా పూర్తి స్థాయిలో రావాలని ఆకాంక్షించారు. అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులు కమిషనర్ హరికృష్ణ ని పూల బొకేలు, శాలువాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, ఎస్.ఈ. శ్యాం సుందర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంహెచ్ఓ మధుసూదన్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …