-జెసి చిన రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం వారు వినియోగదారులకు తక్కువ ధరకు బియ్యం మరియు కందిపప్పు అందించాలనే ఆదేశాల మేరకే జిల్లాలో రైతు బజార్లు, స్పెషల్ కౌంటర్లు యందు మరోసారి కందిపప్పు మరియు బియ్యం ధరలు తగ్గించి అందుబాటులోకి తీసుకోవడం జరుగుతుందని ఈ విషయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన రాముడు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో పౌర సరఫరాలు, ఇతర సమన్వయ అధికారులతో జెసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెసి ఎస్.చిన రాముడు మాట్లాడుతూ, జిల్లాలో నాణ్యమైన నిత్యావసర వస్తువుల తగ్గింపు ధరలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం ఉల్లి ధర పెరుగుదల దృష్ట్యా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం , నివేదిక అందచేయాలని ఆదేశించారు. “సరసమైన ధరలలో నాణ్యమైన సరుకుల అమ్మకం” అను బ్యానర్ అన్ని రైతులుజార్లు మరియు స్పెపల్ కౌంటర్లు యందు ప్రదర్శించవలసిందిగా తెలియచేసారు. ఇప్పటివరకు జిల్లాలో 113 ప్రత్యేక కౌంటర్లు ప్రారంబించి, సదరు కాంటర్లు ద్వారా అమ్మకములు జరుగుచున్నవి. కందిపప్పు (దేశవాళి) బహిరంగ మార్కెట్ ధర రూ.165 , తగ్గించిన కిలో ధర రూ. 150 , బియ్యం (స్టిమ్) బహిరంగ మార్కెట్ ధర రూ.55 , తగ్గించిన కిలో ధర రూ. 48 గా వినియోగదారులకు అందుబాటులో ఉంచా మన్నారు. మున్సిపాలిటీల్లో, మండలముల వారీగా వివరములు ఈ దిగువ విధంగా షాపులు అందుబాటులో ఉన్నాయని జెసి తెలిపారు.
రాజమహేంద్రవరం అర్బన్ – 53 , రాజమహేంద్రవరం రూరల్ – 21, గోకవరం 3 , కోరుకొండ 4 , సీతానగరం 1 , రాజానగరం 1 , రంగంపేట 1 , అనపర్తి 5 , కొవ్వూరు 2 , చాగల్లు 1 , నిడదవోలు 12 , తాళ్ళపూడి 2 , దేవరపల్లి 1 , నల్లజర్ల 2 , ఉండ్రాజవరం 3 , పెరవలి 1.
పైన తెలిపిన మండలములలో రైతుబజార్లు మరియు షాపుల యందు కందిపప్పు మరియు బియ్యం అమ్మకమునకు అందుబాటులో కలవు. కావున వినియోగదారులకు వీటిపై అవగాహన కల్పించడం కోసం ప్రచారం కల్పించవలసిందిగా ఆదేశించి ఉన్నారు. జిల్లా లో గల స్పెషల్ కౌంటర్స్, రిటైల్ షాపుల వద్ద ఎప్పటికప్పుడు నాణ్యతను టెక్నికల్ సిబ్బంది, తూనికలను లీగల్ మెట్రాలజి అధికారులు విదిగా తనిఖీ చేయవలెననిజెసి చిన రాముడు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ప్రస్తుతం జిల్లా లో ఉల్లిపాయాల రేట్లు పెరగుదల పై సదరు రేట్లు తగ్గించి ప్రజలకు అందించేందుకు వీలుగా ఒక ప్రణాళికను సిద్ధం చేయవలసినదిగా మార్కెటింగ్ అధికారులను ఆదేశించడమైనది.