Breaking News

అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీర్చేందుకు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు రూ.25 వేలు విరాళం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పేదవాని ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని, అందులో భాగంగా తమ జీతం నుండి రూ.25 వేలు విరాళంగా అందిస్తున్నామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా అన్నదానం శ్రేష్టమని, మనం విరాళం ఇచ్చే ప్రతి రూపాయి ఎంతో మంది పేదవారి ఆకలి తీర్చేందుకు దోహద పడుతుందని, కావున నగరపాలక సంస్థలో పని చేసే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సంవత్సరంలో ఒక రోజు వేతనాన్ని అన్న క్యాంటీన్లకు విరాళం రూపంలో స్వచ్చందంగా అందించాలని కోరారు. ఇప్పటికే తమ జీతం నుండి రూ.25 వేలు విరాళం అందిస్తామని ప్రకటించామన్నారు. ఈ నెల 16న జరిగిన అన్న క్యాంటీన్ల ప్రారంభం సందర్భంగా గుంటూరు తూర్పు ఎంఎల్ఏ నసీర్ అహ్మద్ గారు ప్రతి శుక్రవారం మధ్యానం తమ నియోజకవర్గ పరిధిలోని 2 అన్న క్యాంటీన్లలో భోజనం ఖర్చు తను చెల్లిస్తామని, ప్రత్తిపాడు ఎంఎల్ఏ బి.రామాంజనేయులు గారు తమ జీతంలో నుండి రూ.30 వేలు విరాళంగా ప్రకటించడం ద్వారా అన్నదాతలకు స్పూర్తిగా నిలిచారన్నారు. అలాగే నగరపాలక సంస్థ ఉద్యోగుల ద్వారా అందే విరాళాలను చెక్ రూపంలో ప్రభుత్వం నిర్దేశిత బ్యాంక్ అకౌంట్ కి జమ చేస్తామని, దాతల వివరాలను ప్రభుత్వంకు లేఖ ద్వారా పంపుతామని తెలిపారు.
అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నదానం చేయాలి అనుకునే వారు ప్రభుత్వం నుండి ప్రారంభించిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అకౌంట్ 37818165097, IFSC:SBIN0020541 చంద్రమౌళి నగర్ బ్రాంచ్ కు ఆన్ లైన్ ద్వారా కూడా విరాళాలు అందించవచ్చని తెలిపారు. నగరంలోని స్వచ్చంద సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు, ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ద్విగిజయం చేయాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *