అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్ ప్రమాద ఘటనపై రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. హోంమంత్రి వంగలపూడి అనితతో ఫోన్‌లో మాట్లాడి ఘటన నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని టి.జి భరత్ కోరారు. పరిశ్రమల శాఖ అధికారులు అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన ఆదేశించారు.
Tags amaravathi
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …