Breaking News

అచ్యుతాపురం సెజ్ లో ఎసెన్షియా ఫార్మా ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన సీఎం చంద్రబాబు

-విశాఖలోని మెడికవర్, కేజీహెచ్ ఆస్పత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం చంద్రబాబు
-ఫార్మా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు..
-ధైర్యంగా ఉండాలని.. ప్రభుత్వం అన్ని చూసుకుంటుందని బాధితులకు సీఎం భరోసా..
-బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన..
-ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.
-తీవ్ర గాయాలైన వారికి రూ.50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
-జిల్లా అధికారులు, మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్ష..

అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
అనంతరం మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఒక బాధాకరమైన సంఘటన. చాలా బాధేస్తోంది నిన్నటి నుంచి కూడా నేను చూశాను. ఇది ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇదొక ఉదాహరణ. అదేమాదిరిగా ఒక ప్రభుత్వం కూడా వారసత్వంగా వచ్చే కొన్ని సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ మనం చూస్తే ఎసెన్షియా అడ్వాన్స్ డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ రెడ్ కేటగిరీలో ఉండే కంపెనీ. 17 మంది చనిపోవడం, ఒకరికైతే 54 శాతం, మరొకరికి 24 శాతం, ఇంకొకరికి 17 శాతం, ఇంకొకరికి 10 శాతం కాలిన గాయాలయ్యాయి. మిగిలినవారికి స్వల్ప గాయాలయ్యాయి. నేను మొదట.. తీవ్రంగా గాయపడినవారిని పరామర్శించాను. ఆ తర్వాత కేజీహెచ్ కి వెళ్లి చనిపోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాను. సంఘటనలు చూసి చాలా బాధేస్తోంది. ఒక యువతి 4 నెలల ప్రెగ్నెంట్ వారికి ఒక బాబు కూడా. పెళ్లి జరిగి రెండేళ్లు కూడా కాలేదు. కానీ అతను చనిపోయాడు, ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధేస్తుంది . అవి చూసిన తర్వాత వాళ్లందరితో మాట్లాడి ఒక భరోసా ఇచ్చాం.

మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం..
చనిపోయినవాళ్లు ఒక్కొక్కరికీ రూ.కోటి ఆర్థికసాయం చేయడం, తీవ్ర గాయాలైనవారికి రూ.50 లక్షలు ఇవ్వడం, స్వల్పంగా గాయపడినవారికి రూ.25 లక్షలు ఇవ్వడం.. ఈ మూడు కేటగిరీల కింద ప్రకటన చేశాం. అయితే మనం ఆర్థికసాయం చేయొచ్చు కానీ కుటుంబాలను తీసుకురాలేము. చనిపోయినవారిని తీసుకురాలేము. అది వారికి జీవితాంతం తీరని లోటు.

ఒకపక్క ఇండస్ట్రీస్ రావాలి.. రెండోపక్కన కూడా సేఫ్టీకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరైనాసరే ప్రాపర్ ఎస్వోపీ ఫాలో అయితే ఈ ప్రాబ్లమ్ వచ్చేది కాదు.

గత ఐదేళ్లలో 119 ఘటనలు.. మృతులు 120 మంది
ఈరోజు మనం ఇక్కడ చూస్తే.. SEZ (సెజ్) లోకి వస్తే అచ్యుతాపురంలో 1,949 ఎకరాలు ఉంది. ఇక్కడ 95 ఫ్లాట్లు ఉన్నాయి. 66 ఫ్లాట్స్ అలాట్ చేశారు. అందులో 36 వచ్చాయి. 26 పనిచేస్తున్నాయి. ఇదే కాకుండా…. మనకు ఫార్మా ఇంకొకటి కూడా ఉంది. ఈ రెండు ఫార్మా యూనిట్లు 208 యూనిట్లు వస్తాయి SEZ (సెజ్), NON SEZ (సెజ్) కలిపి. అలాంటిది వీటిలో పూర్తి స్థాయిలో సెక్యూరిటీ స్టాండర్డ్స్ కానీ జరగలేదు. ఇంకొకపక్కన చూస్తే.. గత ఐదేళ్లలో ఇక్కడ దగ్గరదగ్గర 119 ఘటనలు జరిగాయి 120 మంది చనిపోయారు. 2020లో నాలుగు జరిగాయి. 2021లో 3 జరిగాయి. 2022లో 4, 2023లో 5, 2024 ఇప్పటికివస్తే అచ్యుతాపురం, దీనికిముందు ఏప్రిల్ లో ఒక ఘటన జరిగింది. ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు.. దానికి దీనికి తేడా చూస్తే అది పాయిజనెస్ కెమికల్, ఇక్కడ పాయిజనెస్ కెమికల్ కాదు కానీ ఎక్స్ ప్లోజివ్ కెమికల్. బిల్డింగ్ ను చూస్తే చాలా భయంకరం. గోడల్ని గోడల్ని లేపుకుంటూ అక్కడ ఉండే మనుషుల్ని కూడా గోడకు పైన ఫెన్సింగ్ మీద పడేసిన పరిస్థితి. అంటే అంత పవర్ ఫుల్ బ్లాస్ట్ అయ్యే పరిస్థితి. అక్కడి పరిస్థితి మీరంతా చూశారు కాబట్టి నేను పూర్తి డిటెయిల్స్ మాట్లాడట్లేదు.

సేఫ్టీ నిబంధనలు పాటించడంలో విఫలం:
ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు ఒక హైపవర్ కమిటీ వేశారు. నామమాత్రంగా ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఎగ్జిక్యూషన్ జీరో. అందువల్ల ఈ పరిస్థితి వచ్చింది. జీవో 156 ఒకటి రిలీజ్ చేశారు. కాకినాడలో ఒక సంఘటన జరిగితే అప్పుడు కూడా జీవో 79 రిలీజ్ చేశారు. కానీ రెగ్యులారిటీ అథారిటీస్ మాత్రం నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు తప్ప ఎక్కడా యాక్షన్ తీసుకోలేదు. దానివల్ల రిపీటెడ్ గా జరుగుతున్నాయి. ఏది ఏమైనా దీనిపై డిటైల్స్ ఎప్పటికప్పుడు చెప్తాం. ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఇక్కడ ఇవన్నీ ఫుల్ స్టాప్ పెట్టలేం. I want to go very clearly నేను ఒకసారి అప్పీల్ చేస్తున్నా ఆల్ ఇండస్ట్రియలిస్టులకు. మీరు కూడా ఈ రెడ్ కేటగిరీలో ఉండే ఇండస్ట్రీస్ అన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ ఇండస్ట్రీస్ రావాలి, ఎంప్లాయిమెంట్ కావాలి, వెల్త్ క్రియేట్ చేయాలి. అదే సమయంలో ప్రజల సేఫ్టీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
ఇంటర్నల్ సేఫ్టీ ఆడిట్
అందుకే అందరు పారిశ్రామికవేత్తలకు ఈ మీటింగ్ ద్వారా పిలుపిస్తున్నాం. తక్షణమే సేఫ్టీ మెజర్స్ అన్నీ మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి. ఇంటర్నల్ ఆడిట్ చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోండి. నేను కూడా డిపార్ట్ మెంట్స్ అందరికీ ఆదేశాలిచ్చాను. అన్ని శాఖలకు రేపు మళ్లీ ఒకసారి గట్టిగా ఆదేశాలిస్తాం. ఇప్పటికే ఇంతమునుపు అంతా కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చాం. ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీస్ అన్నీ ఒక కామన్ ప్లాట్ ఫామ్ మీదకి తీసుకొచ్చాం. ఎవరిపాటికివాళ్లు పోయి ఇండస్ట్రీస్ అంతా కూడా ప్రతిరోజు పోయి గొడవ చేయడం కంటే ఈదర్ పొల్యూషన్ బోర్డ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, లేబర్, బాయిలర్స్, ఫ్యాక్టరీస్, లీగల్ మెట్రాలజీ.. వీళ్లు ఐదు కూడా కంబైన్డ్ గా వెళ్లి ఇంకా కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ కి వీటికి. వీళ్లందరూ కూడా కంబైన్డ్ గా వెళ్లాలి, టీమ్ గా వెళ్లాలి. అది కూడా సిస్టమ్ డ్రివెన్ సెలక్షన్ వీళ్లు చేయడానికి వీల్లేదు ఆరోజు మేము పెట్టినవాటిని అనలైజ్ చేయమని చెప్పాను ఇండస్ట్రియల్ మినిస్టర్, సెక్రటరీని.

ఒక సిస్టమ్ లోనే వస్తుంది, ఎవరూ అడిగే పనిలేదు. వాళ్లు పోయి చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత 24 గంటల్లో రిపోర్ట్ ఇస్తారు. అవి కంపేర్ చేసి మళ్లీ సిస్టమ్ లో పెట్టాలి. అది పెట్టిన తర్వాత రాండమ్ కింద మళ్లీ అవసరమైతే ఒక ఆడిట్ చేస్తాం వేరే పార్టీని పంపించి వీళ్లు కాకుండా. అలాంటివి చేసి ఇండస్ట్రిలియస్ట్స్ ఎవరికీ ఇబ్బంది ఉండకూడదు. అదే సమయంలో వీళ్లు ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో అసలు సేఫ్టీ మెజర్స్ ఫాలో కాకపోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది. అందుకే ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని ఒక హైలెవల్ ఎంక్వైరీ కమిటీ వేస్తున్నాను. దీనిపై పూర్తి విచారణ చేస్తారు. ఈ ఇండస్ట్రీలో ఏమేం జరిగింది? ఏవేం సమస్యలు ఉన్నాయి? ఈరోజు నేను చూశాను ఇండస్ట్రీలో ఉండే అవకతవకలు కూడా, వాళ్లకు ఉండే ఇబ్బందులు కూడా. ఒకతను ఇండస్ట్రీ పెట్టాడు అతనికుండే ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ ఇంకొక పార్టనర్ ను తెచ్చుకున్నారు.

మొదట యాదగిరి రెడ్డి పెట్టాడు. తర్వాత డెక్కన్ కెమికల్స్ వచ్చారు. వీరిద్దరిలో గొడవలు వచ్చాయి. వాళ్ల గొడవల ప్రభావం కూడా దీనిపై పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంత సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత, ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రమోటర్ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాడో ఆయన ఇక్కడ రావడం అతని ఫండమెంటల్ డ్యూటీ. ఆయన రాకుండా ఇక్కడ ఉండే ప్లాంట్ మేనేజర్కు అప్పచెప్పేసి వెళ్లిపోయిన పరిస్థితి. ఇంతవరకు మా అడ్మినిస్ట్రేషన్ కు టచ్ లోకి కూడా రాలేదు. అది కరెక్ట్ అప్రోచ్ కాదు. నాకు ఇండస్ట్రీస్ రావాలి, అదేమాదిరిగా ఇండస్ట్రియలిస్ట్స్ ను గౌరవిస్తాం. మీరు కూడా బాధ్యత తీసుకోవాలి.
“ప్రతి పరిశ్రమా తమ భద్రతా ప్రమాణాలను సమీక్షించుకోవాలి.”
బాధ్యత తీసుకోకుండా టేకిట్ ఫర్ గ్రాంటెడ్, మేం పెట్టుబడులు పెట్టాం, మా ఇష్ట ప్రకారం చేస్తాం అంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి హెచ్చరిస్తున్నా. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినా వారిని వదిలిపెట్టేది లేదు, శిక్షిస్తాం, దీనిపై రాజీ పడేది లేదు. ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్లు పీరియాడికల్ గా వచ్చినటువంటి ఫైండింగ్స్ ఇచ్చారా? ఇస్తే యాక్షన్ తీసుకున్నారా? మళ్లీ ఎందుకు రివ్యూ చేయలేకపోయారు? అన్నింటినీ సమీక్షిస్తాం. తగిన చర్యలు తీసుకుంటాం.

ప్రమాద బాధిత కుటుంబాలను పూర్తిగా ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అదేమాదిరిగా మేనేజ్మెంట్నే పే చేయమంటున్నాం నష్టపరిహారం వరకు. మేనేజ్మెంటే పే చేస్తారు. అది వాళ్లే ఇప్పటికే పే చేయించారు. రూ.కోటి అయితే వాళ్లే చెక్కులిచ్చారు. మొత్తం వాళ్లే ఇస్తున్నారు. ఇట్ ఈజ్ వెరీ క్లియర్. బాధితులకు కూడా అదే చెప్తున్నాం. పే చేసిన తర్వాత ఏవిధంగా ఈ కంపెనీ కానీ ఇవన్నీ చేయాలో చేస్తాం.
సేఫ్టీ ఆడిట్ కోసం ఒక కమిటీ కూడా పెడతాం..
విశాఖపట్నంలో పరవాడ దగ్గర ఇంకొక ఫార్మా ఉంది. ఇక్కడ అచ్యుతాపురంలో ఒక ఫార్మా ఉంది. మోడల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అక్కడ డెవలపర్ ఉన్నారు, ఇక్కడ ఏపీఐఐసీ ఉంది. SEZ, NON SEZ ఉంది కొన్ని మిక్స్ డ్ ఉన్నాయి. కొన్ని ఐలా లాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ లో ఇంకా పకడ్బందీగా కొన్ని అఫ్లియంట్ ప్లాంట్స్ అన్నీ ఈ ఒక్క SEZ కు మొత్తానికి ఒకటి ఉంది. కొంతమంది వాళ్లు పెట్టుకుంటున్నారు. ఏవిధంగా అనుసంధానం చేయాలి, ఎంత ఎఫెక్టివ్ గా పనిచేయించాలి అనే విషయాలు కూడా ఎగ్జామిన్ చేస్తాం. అల్టిమేట్గా దీన్ని కూడా సీరియస్గా ఆలోచిస్తున్నాం. ఏదైతే సేఫ్టీ ఆడిట్ కోసం ఒక కమిటీ కూడా పెడతాం. అది కూడా కానిస్టిట్యూట్ చేసి మొత్తం పకడ్బందీగా ఈ విశాఖపట్నంలో రాబోయే రోజుల్లో ఈ ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది. అదే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ కమ్ ఎంప్లాయీస్ కూడా వర్కవుట్ చేస్తాం.

2020లో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12 మంది చనిపోయారు. 2020లోనే హిందుస్థాన్ షిప్యార్డులో జరిగిన ఘటనలో 11 మంది చనిపోయారు. లారస్ లో కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. అది జరిగాక ఇప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇవి కాకుండా ఇద్దరు ముగ్గురు అయితే కంటిన్యూగా జరుగుతున్నాయి. 27 డిసెంబర్ 2019లో జేఎస్పీసీలో స్మైలాక్స్ ల్యాబ్స్ లో ఇద్దరు చనిపోయారు. విజయశ్రీ ఆర్గానిక్స్ లో ఒకరు చనిపోయారు. ప్రతి 3 నెలలకు ఒకటి జరిగింది. 2020 మే 7న ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. 2020 జూన్ 30న పరవాడలో బెంజీన్ గ్యాస్ లీకై ఇద్దరు చనిపోయారు. 2020 జూలై 13న పరవాడలో జేఎన్పీసీలో అగ్నిప్రమాదం జరిగి ఒకరు, 2020 ఆగష్టు 1న హిందుస్థాన్ షిప్ యార్డులో 11 మంది, 2021 సెప్టెంబర్ 21న అభిజిత్ ఫెర్రోస్లో గ్యాస్ లీక్, 2021 డిసెంబర్ 29న రామ్కీ ఫార్మాసిటీలో ట్యాక్సిక్ గ్యాస్ లీకై ఇద్దరు, 2021 డిసెంబర్ 25న పరవాడ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకై ఇద్దరు చనిపోయారు.
ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రమాదాలు జరుగుతున్నాయి
ఇలా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రమాదాలు జరుగుతున్నాయి. దానిపైన ఇచ్చిన కమిటీ కూడా ఎల్జీ పాలిమర్స్ అయిన తర్వాత కమిటీ వేశారు కానీ యాక్షన్స్ నామమాత్రం తీసుకోవడం, ఒక జీవో ఇష్యూ చేసి వదిలేయడం జరిగాయి. అంటే నిరంతరం జరుగుతూ ఉంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టలేకపోయారు. ఇప్పుడు ఎట్టిపరిస్థితుల్లో ఫుల్ స్టాప్ పెడతాం. ఆల్ ఇండస్ట్రీస్కు చెప్తున్నా నేను క్లియర్గా.. యూ మస్ట్ హేవ్ ఎ ఎస్వోపీ. చాలా క్లియర్ గా మీరు రెడ్ జోన్ ఇండస్ట్రీస్ అన్నీ ఫోకస్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. ఒకసారి మీ ప్రొసీజర్స్ అన్నీ మీరు రివ్యూ చేసుకోవాలి. ఒకసారి మీరు రివ్యూ చేసుకున్న తర్వాత ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేసే బాధ్యత మీది.

రిపోర్ట్ రావడంతో పాటు డిపార్ట్ మెంట్స్ అన్నీ డేటా కోసం ఎక్సర్ సైజ్ చేయాలి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయి, ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాం, ఎంతమంది చనిపోయారు, అవన్నీ ఏవిధంగా స్ట్రీమ్ లైన్ చేస్తాం, శాఖాపరమైన రివ్యూలు కూడా ఏవిధంగా చేస్తున్నాం, అదేసమయంలో స్ట్రిక్ట్ గా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేం చేసే సిస్టమ్స్ కానీ ఆ సిస్టమ్స్ లో వీళ్లు ఇన్స్పెక్ట్ చేసిన రెగ్యులారిటీ అథారిటీస్ వచ్చినప్పుడు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అన్నీ అమలు చేశారా? లేదా? చేయకపోతే వాళ్లపై ఎలా యాక్షన్ తీసుకోవాలి? ఇవన్నీ చేసి ప్రమాదాలను వీలైనంతవరకు తగ్గించడం, జీరో అనేది వీలు కాదు కానీ వీలైనంతరకు తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం.
కుట్రలు చేసినా ఆ కుట్రలు కూడా ఎక్కువ రోజులు సాగవు.
ఈ మధ్య కొన్ని జరుగుతున్నాయి. నేను అవి మాట్లాడటం లేదు. కుట్ర ఉందా? లేదా? ఎందుకంటే గుడ్డకాల్చి ముఖాన పారేసి తుడుచుకోమంటున్నారు. వీళ్లే వచ్చి విమర్శిస్తారు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో తెలుగుదేశం కానీ ఇప్పుడున్న ఎన్డీఏ కానీ వెనక్కిపోయే సమస్య ఉండదు. ఎవరైనా కుట్రలు చేసినా ఆ కుట్రలు కూడా ఎక్కువ రోజులు సాగవు. ఏదేమైనా ఇటీవల జరిగే సంఘటనలు, ఒక్కోసారి నాకు కూడా అనుమానం వస్తోంది. అంటే వారసత్వంగా వచ్చిన లెగసీ సమస్యలా? లేకపోతే ఇండస్ట్రీ కానీ ఇటు అడ్మినిస్ట్రేషన్ కానీ లెక్కలేనితనంలోకి వెళ్లిపోయారా? లేకపోతే ఈ యాక్సిడెంట్స్ అన్నీ మామూలే అనుకుంటున్నారా? నాకైతే అర్థం కావడంలేదు దీనికి పరాకాష్ట నిన్న జరిగింది. మేనేజ్ మెంట్ రాలేకపోయారు ఇక్కడికి. వారికి వివాదాలు ఉండొచ్చు. కానీ ఆయనకు సోషల్ రెస్పాన్స్ బులిటీ ఉంది. నేను వెంటనే నిర్ణయం తీసుకోవచ్చు. కానీ నేను రెండూ బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఆలోచిస్తున్నా.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాం.
ఇక్కడ కావాల్సినటువంటి ట్రామా సెంటర్ కానీ, బర్న్ యూనిట్ వంటి హాస్పిటల్ తో పాటు ఫైర్ స్టేషన్ కూడా రావాల్సి ఉంది. కార్మికులకు ఏదైనా జరిగితే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంది అవన్నీ కూడా చేస్తాం. కాంప్రహెన్సివ్ డెసిషన్ తీసుకుంటాం. డిపార్ట్ మెంట్స్ తో రివ్యూ చేస్తాం. మా రూల్స్, రెగ్యులేషన్స్ , రెగ్యులేటరీ అథారిటీస్ యొక్క ఇన్స్ పెక్షన్స్ అన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూశాం.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. గతంలో అమలు చేసిన విధానాలు, మరింత ఎఫెక్టివ్ అయిన నూతన ఆలోచనలను కూడా 3 నెలల్లో అన్నింటినీ తీసుకొస్తాం. 95 శాతం ఇండస్ట్రీస్ పెట్టినవారు బాధ్యత తీసుకుంటున్నారు. ఎక్కడో 1 లేదా 2 శాతం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు.

స్టాఫ్ లేకపోతే పెంచుతాం. అవసరమైతే టెక్నాలజీస్ ను అడాప్ట్ చేసుకుంటాం. స్మెల్ ను గుర్తించే సెన్సార్స్ వస్తున్నాయి, లీకేజీలను గుర్తించే సెన్సార్స్ వస్తున్నాయి.. ఇండస్ట్రీస్ మేనేజ్ మెంట్ లు కూడా లేటెస్ట్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. శ్రీసిటీ బెస్ట్ ఇండస్ట్రియల్ జోన్. ఇక్కడే బ్యాండెక్స్ వచ్చింది బాగా జరుగుతోంది. ఇంకా చాలా వస్తున్నాయి. తప్పు చేసినవారిపై మాత్రమే చర్యలు తీసుకోవాలి. ఎవరినీ ఉపేక్షించం. ఇన్వెస్టర్స్ నమ్మకం కోల్పోయేది కూడా లేదు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తాూ ముందుకెళ్తాం. గత ఐదేళ్లలో ఒక్క ఇన్వెస్ట్ మెంట్ రాలేదు, ఇప్పుడు ఉండే ఇండస్ట్రీస్ మీద పడ్డారు. ఎక్కడికక్కడ లూట్ చేశారు. సిస్టమ్స్ పనిచేయకుండా పర్సనల్ గా వెళ్లిపోయారు. అందువల్ల అన్నీ డెస్ట్రాయ్ అయిపోయాయి. ప్రతి ఇండస్ట్రీలో ప్రమాదాలు జరుగుతుంటే నాకే ఆశ్చర్యమేస్తోంది. ఏం జరుగుతోంది? ఏమవుతోందా? అని.
ఇండస్ట్రీస్ రాకపోతే ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయలేము..
ఇండస్ట్రీస్ రాకపోతే ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయలేము.. వెల్త్ కూడా క్రియేట్ చేయలేము.. జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం కానీ అందర్నీ లోపల వేసేయండి, మొత్తం కొట్టేయండి, ఇండస్ట్రీస్ రాకుండా తరిమేయండి అంటే నష్టపోయేది మన పిల్లలే. మేం యజమాని వైపు కాదు యాంట్రిప్రెన్యూర్ వస్తేనే ఉద్యోగాలొస్తాయి. ఉద్యోగాలు రాకపోతే సన్యాసి సన్యాసి రాసుకుంటే ఏమొస్తుంది? రేపు పేదవాడ్ని ఏవిధంగా ఆదుకుంటారు? ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది? జీరో పావర్టీ సాధించాలంటే క్రియేట్ వెల్త్. వెల్త్ క్రియేట్ చేస్తేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మా మీద నమ్మకంతోనే ప్రజలు మాకు 93 శాతం స్ట్రెయిక్ రేటుతో ఘన విజయం అందించారు. దానిని మేం నిరూపించుకోవాలి. అన్నీ బ్యాలెన్స్ చేయడమే మా పని. మేం అధికారంలోకి వచ్చి 70-80 రోజులు మాత్రమే అయ్యింది కదా. ఇక్కడ వెదర్ రిపోర్ట్ బట్టి సెన్సార్స్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు ఫ్యాక్టరీస్ నుంచి ఎంత (గ్యాస్) వదిలిపెడుతున్నారు? ఏ టైమ్కి వదిలి పెడుతున్నారు? అన్నీ కూడా సమావేశం పెట్టి నిర్ణయం తీసుకుంటాం.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *