Breaking News

శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం


దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా, దుగ్గిరాలనందు శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం దుగ్గిరాల నుండి విజయవాడ వెళ్ళే మెయిన్‌రోడ్డులో శ్రీ అభయాంజనేయస్వామివారి 42 అడుగుల భారీ విగ్రహం అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయా ట్రస్ట్‌ అధ్యక్షులు జూటూరి శ్రీను మాట్లాడుతూ ఈ దైవ కార్యక్రమాన్ని అందరి సహకారంతో దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నానని, అందరికీ స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. ఈ విగ్రహ ప్రతిష్టాపనకు సుమారు 45 లక్షలు అయ్యిందని దీనికి తనతోపాటు మేమువున్నామని దాతలు తమవంతు సహయసహకారాలు అందించారని తెలిపారు. ఈ రోజు అన్నదానం 10 వేల మందికి అన్నప్రసాద వితరణ కావించామన్నారు. తనకు అన్ని విధాలుగా సహకారాలు అందించిన గూడూరు వెంకట్రావు, ఉమా, శ్రీనాధ్‌, మోహన్‌ తదితరులు అందరికీ పేరుపేరున రుణ పడి వుంటానన్నారు. ఇది సమిష్టి కృషి అని తెలిపారు. ఈనెల 25 అంకురార్పణ కావించి, 26, 27 కార్యక్రమాలు 28 యాగం, యంత్రస్థాపన, ప్రాణప్రతిష్టతో పరిసమాప్తం కావించామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదాంతం శ్రీ విష్ణుభట్టాచార్యులు పర్యవేక్షకులుగా వ్యవహరించారన్నారు. ఈ కార్యక్రమం అంతా గోపయ్యస్వామి సమేత లక్ష్మీ తిరుపతమ్మ, అంకమ్మ తల్లి దేవస్థానం ప్రాంగణంలో చేయడానికి ఆ స్వామివార్ల ఆశీస్సులే కారణమన్నారు. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చేసి భక్తులకు అన్ని విధాలు సౌకర్యవంతమైన విధంగా తీర్చిదిద్దే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *