-మూడు లంక గ్రామాల నుంచి 228 మంది తరలింపు
-వసతి, భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది
-రాజమండ్రి ఆర్డీవో పర్యవేక్షణలో తరలింపు
– కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి ఎగువ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా మూడు లంక గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. భద్రాచలం నీటిమట్టం 44.40 అడుగులు చేరడంతో దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయడం జరుగుతుందని ఆ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోదావరి పరివాహక ప్రాంతాల్లోని లంక గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజీ నుంచి రాత్రి 8 గంటల సమయంలో 7,14,614 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామన్నారు. వరద నీరు పెరిగే హెచ్చరికల నేపథ్యంలో మర బొట్లు ఏర్పాటు చేసి గోదావరి నది లంక గ్రామాల్లో బ్రిడ్జి లంక నుంచి 108 మందిని, కేతా వారి లంక, వెదురులంక నుంచి 120 మందినీ రాజమహేంద్రవరంలో రెండు పునరావాస కేంద్రాలకు తరలించి వసతి కల్పించడం జరిగిందన్నారు. బ్రిడ్జిలంక కు చెందిన 108 మందిని ఆల్కట్ గార్డెన్ లోని మునిసిపల్ కళ్యాణ మండపంకి, ,కేదారి వారిలంక, వెదురులంక లకు చెందిన 120 మందిని చందా సంత్రం కు తరలించడం జరిగిందన్నారు. వారికి భోజన సదుపాయంతో పాటు, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియను రాజమహేంద్రవరం ఆర్డిఓ కేఎల్ శివ జ్యోతి, జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎం మార్టిన్ లూథర్ కింగ్, ఫిషరీస్ అధికారి కె వి కృష్ణారావు, నగర పాలక సంస్థ అధికారులు పర్యవేక్షించడం జరిగిందన్నారు