-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం ఎంజి రోడ్లో గల ఇంద్ర గాంధీ మున్సిపల్ స్టేడియం నందు వరద ప్రభావిత ప్రాంతాలకు జరిగే ఆహార పంపిణీ వాహనాలను పరిశీలించారు రోజుకు లక్షల్లో వెళ్లే భోజనం, త్రాగునీరు, పాలు, బిస్కెట్లను వాహనాల ద్వారా అవసరమైన ప్రతి ఒక్కరికి ఆహారం చేరేటట్టు చర్యలు తీసుకుంటున్నారు. తదుపరి మొగల్రాజపురంలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో యాపిల్ పళ్ళు , బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ , నూడిల్స్ ప్యాకెట్లను ఒక పాకెట్ల ప్యాకింగ్ చేస్తున్న సిబ్బంది, వాలంటీర్లను పరిశీలించారు వాహనం ద్వారా బాధితులకు చేరేటట్టు చర్యలు తీసుకున్నారు. దాదాపు 6 లక్షల ఆపిల్స్,6 లక్షల బిస్కట్ ప్యాకెట్ లు,3లక్షల వాటర్ బాటిల్స్,3లక్షల పాల ప్యాకెట్ లు,4 లక్షల నూడిల్స్ ప్యాకెట్లను వరద బాధితుల కోసం సిబ్బంది,వాలంటీర్లు ప్యాక్ చేసి వాహనాల ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలకు తరలించారు.