గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వర్షాల వలన దెబ్బతిన్న రోడ్లకు యుద్దప్రాతిపదికన ప్యాచ్ వర్క్ లు, 2 రోజుల్లో పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగర కమిషనర్ ఇంజినీరింగ్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా రోడ్ల ప్యాచ్ వర్క్స్ పై వివరాలు అడిగి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వర్షాల వలన దెబ్బతిన్న రోడ్ల వలన ప్రజల రాకపోకలకు అసౌకర్యం కల్గుతుందని, కనుక ప్రజల సౌకర్యార్ధం ప్రధాన, అంతర్గత రోడ్లకు ఆదివారం లోపు ప్యాచ్ వర్క్ లు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. బిటి రోడ్లు, సిసి రోడ్లను పూర్తి స్థాయిలో ప్యాచ్ వర్క్ లు చేపట్టాలని, మట్టి రోడ్లను ప్రాధాన్యతగా మరమత్తులు చేయాలని ఆదేశించారు. ఏఈల వారీగా దెబ్బతిన్న రోడ్ల ప్యాచ్ వర్క్ లను సమగ్రంగా చేపట్టేలా డిఈఈలు, ఈఈలు పర్యవేక్షణ చేస్తూ, ప్రతి రోజు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నగరంలోని పార్క్ ల్లో వాకింగ్ ట్రాక్ ల ప్రస్తుత స్థితి పై నివేదిక ఇవ్వాలన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …