డ్రైన్ల పై ఆక్రమణలు ఏర్పాటు చేయవద్దు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
డ్రైన్ల ఆక్రమణలు, రోడ్ల మీదకు ర్యాంప్ లు నిర్మాణం చేస్తే వర్షాలు వచ్చినప్పుడు నీరు వెళ్లడానికి మార్గం లేక ఇళ్లల్లోకి వస్తుందని, కనుక ప్రజలు తమ ఇళ్లు, షాప్ ల ముందు డ్రైన్ల పై ఆక్రమణలు ఏర్పాటు చేయవద్దని విజయవాడ 62వ డివిజన్ పర్యవేక్షణ అధికారి, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. గురువారం విజయవాడ 62వ డివిజన్ లోని ప్రధాన రహదారుల వెంబడి డ్రైన్ల ఆక్రమణలను 2వ రోజు జెసిబిలతో తొలగించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ 62వ డివిజన్ పరిధిలో ప్రధాన రహదారుల్లో వెంబడి మేజర్ డ్రైన్ల పై ఆయా వ్యాపార సంస్థలు ర్యాంప్లు, వివిధ వ్యాపార అవసరాలకు ఆక్రమణలు చేయడం వలన ఇటీవల కురిసిన వర్షానికి నీరు చుట్టు పక్కల లోతట్టు ప్రాంతాల్లో చేరి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందన్నారు. బుధవారం నుండి డివిజన్ పరిధిలో మేజర్ డ్రైన్ల పై ఆక్రమణలు, ర్యాంప్ లను జెసిబితో తొలగిస్తున్నామన్నారు. ప్రజలు డ్రైన్ల ఆక్రమణ చేయకుండా సహకరించాలని కోరారు. డివిజన్ పరిధిలో వరద నీరు బెయిల్ అవుట్ అయిన ప్రాంతాల్లో మెగా పారిశుధ్య పనులను ప్రజారోగ్య కార్మికులు చేపడుతున్నారని, ఇళ్లు శుభ్రం చేసుకునే ప్రజలు వ్యర్ధాలను రోడ్ల మీద వేయకుండా అందుబాటులోని ప్రజారోగ్య కార్మికులకు అందించాలన్నారు. అతి త్వరలో డివిజన్ ని సాదారణ పరిస్థితికి తీసుకురావడానికి విశేష కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *