-వరద ముంపుకి గురైన పంట పొలాలు పరిశీలన
-ఎమ్మెల్యే సౌమ్యతో కలిసి చెవిటికల్లు లో పర్యటన
-బురద రాజకీయం చేసే జగన్ జీవితం అబద్ధం
కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ముంపు వల్ల పంట పొలాలు నీటి మునిగి నష్టపోయిన రైతులందర్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకుంటారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎంపి కేశినేని శివనాథ్ భరోసా కల్పించారు.. అనంతరం వరద బాధితులకి ఎమ్మెల్యే సౌమ్య తో కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
అనంతరం ఎం.పి కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ వరద కారణంగా నష్టపోయిన చివరి రైతు వరకు వివరాలు సేకరించి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. ఇవాళ రైతాంగం మొత్తాన్ని మా ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. ఈ వరద సమయంలో కూడా ఎమ్మెల్యే జగన్ బురద రాజకీయం చేస్తున్నాడన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నాడని, ఆ భ్రమలను బయటికి వచ్చి వాస్తవాలు గ్రహించాలన్నారు. జగన్ కి డ్రామాలాడటం అలవాటుగా మారిపోయిందన్నారు. జగన్ బాధితుల కోసం కమిటీ వేసి ఇస్తానన్న కోటి రూపాయలు ఎక్కడంటూ ఎద్దేవా చేశారు. వరద బాధితులకి కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేకపోయిన జగన్ ప్రజలపై ప్రేమ వున్నట్లు మాట్లాడం చూస్తే విడ్డూరంగా వుందన్నారు. ఈ సారి జగన్ కి ప్రజలు ఆ 11 సీట్లు కూడా ఇవ్వటానికి సిద్దంగా లేరన్నారు. జగన్ ఏమి చేయలేకపోయాడో…అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసి చూపించారని తెలిపారు. అందుకే ప్రజలందరూ ఈ విపత్తు నుంచి బయటపడటం సీఎంగా చంద్రబాబు నాయుడు వుండటం వల్లే సాధ్యమంటున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్ రావు, కంచికచర్ల మండల పార్టీ ప్రెసిడెంట్ కోగంటి బాబు, గ్రామపార్టీ ప్రెసిడెంట్ రామకృష్ణలతో పాటు ఎన్డీయే కూటమి స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.