మంగళగిరి లో త్వరలో క్రికెట్ హబ్ ఏర్పాటు చేస్తాం : ఎం.పి.కేశినేని శివ నాథ్

-ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో ఆంధ్ర క్రికెట్ అకాడమీ కార్యాలయం లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యం లో గురువారం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ అతి త్వరలో క్రికెట్ స్టేడియం పూర్తి చేసి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేందుకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తావని అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే ఐటి శాఖ మంత్రి నారాa లోకేష్ సహకారంతో రోడ్లు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తామని కేశినేని శివనాథ్ తెలిపారు.అలాగే వైజాగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి కూడా అభివృద్ధి చేస్తామని ఉన్న క్రికెట్ స్టీడియంతో పాటు త్వరలోనే స్పోర్ట్స్ హబ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంపీ కేశినేని శివనాధ్ తెలిపారు. ఈ సమావేశంలో . ఏసీఏ ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్,. ఏసీఏ కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా దండ మూడి శ్రీనివాస్, కౌన్సిలర్గా గౌరు విష్ణుతేజ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *