Breaking News

సెప్టెంబర్14 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలి

-పక్షం రోజులు షెడ్యుల్ మేరకు స్వచ్ఛత హి సేవా 2024 కార్యక్రమాలు.. స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత అనే నినాదంతో కార్యక్రమాల నిర్వహణ…. మహాత్మా గాంధీజీ జయంతి రోజున స్వచ్ఛ భారత్ దివస్ ఘనంగా నిర్వహణ
-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు నిర్వహించునున్న స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలు అంకిత భావంతో చేపట్టి సంపూర్ణంగా స్వఛ్చమైన మునిసిపాలిటీ, పంచాయితీలు గా త్రీర్చి దిద్దాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాల నిర్వహణపై మునిసిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లు, ఈఓ పీఆర్డి లతో వర్చువల్ విధానంలో, జిల్లా అధికారులతో తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించి స్వచ్ఛత హి సేవా 2024 కార్యక్రమాల అమలుపై దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2024 వ సంవత్సరం సెప్టెంబర్ 14 వ తేది నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు 15 రోజులు స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత అనే నినాదంతో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలు నిర్వహించుకోనున్నామని అన్నారు.

అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి రోజున వారి గుర్తుగా స్వచ్ఛభారత్ దివస్ గా నిర్వహించుకోనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని మున్సిపల్, పంచాయతీల పరిధిలో జిల్లాలోని అన్ని ప్రాంతాలలో స్వచ్ఛతకి భాగిదారి లో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛభారత్ అమలుకు సిటిజన్ ఇన్ఫ్లుయెన్సర్లు, స్వచ్ఛంద సంస్థలు ఇతరులను భాగస్వాములు చేసి ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే సంపూర్ణ స్వచ్ఛమైన పారిశుధ్య మున్సిపాలిటీలు గ్రామాల లక్ష్యంగా మెగా పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమాలను ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు, అధికారులు స్వచ్ఛంద సంస్థలు అందరి భాగస్వామ్యంతో బ్లాక్ స్పాట్స్ లను గుర్తించి, ఎప్పటినుండో చెత్తతో నిండి ఉన్న డంప్ లను, ఇతరత్రా వాటిని శుభ్రపరిచే కార్యక్రమాలు నిర్వహించడం అలాగే సఫాయిమిత్ర సురక్ష సివిర్ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు వారి కుటుంబీకులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి సోషల్ సెక్యూరిటీ కవరేజ్ కొరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని రోజువారి షెడ్యూల్ను అనుసరించి కార్యక్రమాల నిర్వహణ చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు.

కార్యక్రమాలను వివరిస్తూ సెప్టెంబర్ 14న స్వచ్ఛతాహి సేవ 2024 ప్రారంభం స్వచ్ఛంద సేవ శ్రమదానాలు చేపట్టాలని, 15వ తేదీన మానవహారాలు నిర్వహించదాంతో పాటు, కార్యాలయాలు విద్యాసంస్థలు, ఇతరత్రా భవనాలను శుభ్రపరచడం అలాగే ఆరోగ్య శాఖ వారు పారిశుధ్య కార్మికుల కోసం ఆరోగ్య పరీక్షలకు షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని సంబంధిత పిహెచ్సిలు ఆసుపత్రులకు అనుసంధానం చేసి తేదీల వారీగా వారికి వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అలాగే సెప్టెంబర్ 16 న స్వచ్ఛత రన్, సైకిల్ థాన్, మారథాన్ లను పర్యటకశాఖ వారు ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని చేపట్టాల్సి ఉంటుందని అలాగే సంపూర్ణ స్వచ్ఛత కింద గ్రామ నగరాలలో బ్లీచింగ్ లిక్విడ్స్ స్ప్రే వంటివి నీటి నిలువ ప్రాంతాల్లో గుర్తించి స్ప్రే చేయాల్సి ఉంటుందని అంతే కాకుండా ఆరోగ్యశాఖ వారు శానిటేషన్ వర్కర్లకు ఫస్ట్ ఎయిడ్ పై శిక్షణ అందించాల్సి ఉంటుందని సూచించారు. 17 సెప్టెంబర్ న స్వచ్ఛత ప్రతిజ్ఞ ప్రతి కార్యాలయము విద్యాసంస్థల్లో పబ్లిక్ ప్లేసెస్ లో చేయాల్సి ఉంటుందని నిర్వహించాల్సి ఉంటుందని మ్యాప్స్ మై ఇండియా ద్వారా చెత్త డంపులను గుర్తించి వాటిని శుభ్రపరచడం చేపట్టాలని 18 సెప్టెంబర్ న ప్లాంటేషన్ డ్రైవ్ ఏక్ పేడ్ మాకే నామ్ పేరిట నిర్వహించాలని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ పిపిఈ కిట్లు సేఫ్టీ పరికరాలు పారిశుధ్య కార్మికులకు అందజేయడం, సెప్టెంబర్ 19న మెప్మా డి ఆర్ డి ఏ ఎస్ హెచ్ జి స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ కార్యక్రమం పై విస్తృత ప్రచారం నిర్వహించడం మరియు పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొని అలాగే పార్కులు శుభ్రపరచడం వాటి నిర్వహణ, సెప్టెంబర్ 20న మిషన్ లైఫ్ కింద సేవ్ ఎనర్జీ వాటర్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్, ఆరోగ్యకరమైన ఆహారపాలవాట్లు తెలపడం ఈ-వేస్ట్ నిర్వహణ కార్యక్రమాలు చేపట్టడం, సెప్టెంబర్ 21న రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ లను తనిఖీలు నిర్వహించి రహదారుల శుభ్రపరచడం, 22న త్రాగు నీటి ట్యాంక్ లలో సూపర్ క్లోరినేషన్ చేపట్టడం, త్రాగునీటి శాంపుల్ పరీక్షలు నిర్వహించడం విద్యాసంస్థలలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం, పారిశుధ్య కార్మికులకు మొబైల్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయడం చేపట్టాలని సూచించారు. సెప్టెంబర్ 23న కమర్షియల్ ప్రాంతాలు మార్కెట్ ప్రాంతాలలో శుభ్రపరచడం పారిశుధ్య కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, సెప్టెంబర్ 24న వేస్ట్ టు ఆర్ట్ కింద శానిటేషన్ పార్కులు సెల్ఫీ పాయింట్లు మున్సిపాలిటీలో గ్రామాలలో ఏర్పాటు చేయడం, సెప్టెంబర్ 25న స్వచ్ఛభారత్ స్వచ్ఛ గ్రామపంచాయతీ కాంపిటీషన్లు నిర్వహించడం పబ్లిక్ ప్రాంతాలలో సుందరీ కరణ సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు ముఖ్యమైన కూడల్లలో ఏర్పాటు చేయడం, సెప్టెంబర్ 26న గ్రామ వార్డు సభలను నిర్వహించడం ఎక్కువ జనావాస ప్రాంతాలలో వీధులను శుభ్రపరచడం డ్రైవ్ కార్యక్రమం, సెప్టెంబర్ 27న చెత్త నుండి సంపద కేంద్రాల సుందరీకరణ వాల్ పెయింటింగ్ చేయడం ప్రజాభాగస్వామ్యం తో చెత్త నిర్వహణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, సెప్టెంబర్ 28న వాల్ పెయింటింగ్ పార్కుల సుందరీకరణ ముఖ్యమైన పర్యాటక కూడల్లలో రోడ్లు ఫ్లైఓవర్ ల వద్ద సుందరీ కరణ అలాగే క్లీన్ స్ట్రీట్ వెండర్ క్యాంపెయిన్ నిర్వహణ పారిశుద్ధ కార్మికుల కు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భీమా నమోదు సహాయం, సెప్టెంబర్ 29న స్వచ్ఛత ప్రతిజ్ఞలు ప్రతి కార్యాలయంలో విద్యాసంస్థలు పబ్లిక్ ప్రాంతాలు చేపట్టడం పర్యాటక ప్రదేశాలు మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాంతాలలో స్వచ్ఛత కార్యక్రమాలు శానిటేషన్ ప్రక్రియలు కమ్యూనిటీ భాగస్వామ్యంతో చేయడం, సెప్టెంబర్ 30న ప్రజా అవగాహన కార్యక్రమం చెత్తను వేరుపరచడం రీసైకిల్ చేయడం కంపోస్టు తయారు చేయడం పై అవగాహన కల్పించడం, అక్టోబర్ 1న విద్యాసంస్థలలో స్వచ్ఛ హాకథాన్ల నిర్వహణ, అక్టోబర్ 2న గ్రామసభలు నిర్వహించి స్వచ్ఛ భారత్ దివస్ ఉత్సవాల నిర్వహణ పారిశుధ్య కార్మికుల సన్మానం ఉత్తమ పొదుపు సంఘాల అవార్డులు, చెత్త నుండి సంపద కేంద్రాల పునః ప్రారంభం తదితర కార్యక్రమాలను నిర్వహించాల్సి పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్ ఆదేశించారు. అలాగే తాము గుర్తించిన డంపులను చేపట్టిన కార్యక్రమాలను ఈ పక్షం రోజులు చేపట్టిన కార్యక్రమాలు అన్నింటిని సంబంధిత స్వచ్ఛత ఈ సేవ పోర్టల్ నందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసేలా వెబ్సైట్ నందు హ్యాష్ ట్యాగ్ చేసి ఫోటోలను అప్లోడ్ చేయాలని సూచించారు.

తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, డిపిఓ సుశీల దేవి మాట్లాడుతూ ఈ క్యాంపెయిన్ లో భాగంగా ర్యాలీలు, మారథాన్ రన్, వర్క్ షాపులు, వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు రోజువారీ షెడ్యూల్ మేరకు నిర్వహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జిల్లా, డిప్యూటీ సిఈఓ ఆది సేషా రెడ్డి, డివిజన్, మునిసిపల్, మండల తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *