-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పలు చోట్ల రహదారులు దెబ్బతిన్న పరిస్ధితిలో ఇసుక రవాణాకు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వినియోగదారులు తమవంతు సహకారం అందించాలని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విన్నవించారు. పలు రీచ్ ల నుండి ఇసుక సరఫరా నిలిచిపోయిందని, వర్షాలు తగ్గి, రవాణా పరిస్ధితులు మెరుగైన తురువాత పూర్తి స్ధాయిలో ఇసుక అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్దితులు, వరద ప్రభావిత ప్రాంతాల వల్ల ఇసుక నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయని, వర్షాకాలం ముగిసిన తరువాత ఇసుక నిల్వలకు కొరత ఉండబోదన్నారు. శనివారం ఉదయానికి రాష్ట్రంలోని 26 ఇసుక నిల్వ కేంద్రాలలో 14,07,986 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని తెలిపారు. 9940 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా గురు వారం 970 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 840 మంది దరఖాస్తుదారులకు 8501 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసామని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వివరించారు.
Prajavartha Online Telugu News