అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలేరు వరద నుంచి ఐదు గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించేలా చేపట్టిన జాగ్రత్త చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఏలేరు వరద ముంపు హెచ్చరికలు మొదలైన సమయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికార యంత్రాంగానికి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఎక్కడయినా గట్లు బలహీనంగా ఉంటే రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ క్రమంలో సామర్లకోట మండలం వి.కె.రాయపురం దగ్గర ఏలేరు కాలవ గట్టుకి గండిపడే ప్రమాదాన్ని అధికారులు గుర్తించారు. పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీ కృష్ణతేజ ఆ ప్రాంతాన్ని పరిశీలించి జిల్లా యంత్రాంగానికి, మండల అధికారులకు, స్థానిక పంచాయతీ సిబ్బందికి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో గట్టు వెంబడి పకడ్బందీ చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని పర్యవేక్షించారు. మూడు రోజులపాటు అక్కడే అధికారులు, ఉద్యోగ బృందం ఉండి పర్యవేక్షించింది. ఇందుకు స్థానిక సర్పంచ్, మాజీ సర్పంచ్, గ్రామస్తులు సహకరించారు.
ఈ చర్యలు చేపట్టకపోతే వి.కె.రాయపురంతోపాటు మాధవపట్నం, రామేశ్వరం, కొవ్వాడ, రేపూరు గ్రామాలు వరద ముంపుతో ప్రభావితం అయ్యేవి. ఈ విపత్కర పరిస్థితి నుంచి ఐదు గ్రామాల నుంచి తప్పించేలా ముందు చేపట్టిన రక్షణ చర్యలు ఫలితాన్ని ఇచ్చాయి.
వి.కె.రాయపురం దగ్గర గండిపడకుండా చర్యలు ఫలితాన్ని ఇవ్వడంపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంతృప్తిని వ్యక్తం చేశారు. రక్షణ చర్యల్లో పాలుపంచుకున్న జిల్లా అధికారులకు, సామర్లకోట ఎంపీడీఓ, తహశీల్దార్, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. బృందం – ఏపీఓ, ఈసీ, టి.ఏ., ఫీల్డ్ అసిస్టెంట్ లకు, స్థానిక సర్పంచ్, మాజీ సర్పంచ్ లకు అభినందనలు తెలిపారు.
Tags amaravathi
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …