-శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా పూర్తిస్థాయిలో రెండు పూటల అందించే విధంగా చర్యలు చేపట్టనున్నామని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. సోమవారం స్థానిక గోదావరి గట్టున ఉన్న హెడ్ వాటర్ వర్క్స్‌ను పరిశీలించి అనంతరం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరదల నేపధ్యంలో నగర ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా పూర్తిస్థాయిలో రెండు పూటల అందించే విధంగా చర్యలు చేపట్టనున్నామని, ఆ దిశగా నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు. గత ఐదేళ్ల కాలంలో స్థానిక నాయకులు నగరంలో ఇతర కార్యక్రమాలకి నిధులను వెచ్చించారు తప్ప, నగర ప్రజల దాహార్తిని తీర్చే త్రాగునీటి సమస్యని పరిష్కరించే దిశగా దృష్టి సారించలేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఆ దిశగా ప్రభుత్వ ఏర్పడిన రెండు మాసాల్లోనే నగర ప్రజలకు రెండు పూటల శుద్ధి చేసిన త్రాగునీటిన అందించాలని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షిస్తున్నమన్నారు. అధికారులందరూ అనుభవం ఉన్న వారిని వారిలో సమన్వయం లోపం కనబడుతుందన్నారు.
నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు ప్రజలకు త్రాగునీటినందించే వాటర్ వర్క్స్ వద్ద అదనపు మోటార్స్ ఏర్పాటు చేసుకునే విధంగా దృష్టి సారించాలని ఒక మోటర్ పనిచేయకపోయినా, రెండో మోటార్ తో ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. త్రాగునీటిని పంపింగ్ చేసే మోటారు చెన్నై నుంచి రావాల్సి ఉంటుందని ఆర్డర్ చేసిన రెండు నెలల్లో వస్తుందన్నారు. గత ప్రభుత్వంలో ఎవరు ఇటువంటి అంశాలను పట్టించుకోలేదన్నారు. రాజమహేంద్రవరానికి నీటి కొరత లేకుండా పూర్తిస్థాయిలో త్రాగునీటి అందించే విధంగా కూటమి ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని శాసనసభ్యుల ఆది రెడ్డి వాసు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నగరపాలకు సంస్థ ఎస్ఈ జి. పాండురంగారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.