రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం స్వచ్చత హి సేవా కార్యక్రమం జిల్లా స్థాయి కార్యక్రమం రాజమహేంద్రవరంలో, విశ్వ కర్మ జయంతి వేడుకలు కలెక్టరేట్ నందు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. స్వచ్ఛత హి సేవా తొలి రోజు కార్యక్రమం జిల్లా స్థాయిలో, మండల, గ్రామ స్థాయి లో మానవ హారం, శుభ్రత పై మెగా డ్రైవ్ ను ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఆధ్వర్యంలో ప్రజలతో సామూహిక పరిశుభ్రత డ్రైవ్‌లు, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఆరోగ్య సంరక్షణ, సేవలు అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయి కార్యక్రమం వై జంక్షన్ వద్ద ఉదయం 9.30 గంటలకు నిర్వహించి సంతకాలు సేకరణ, గొడప్రతి ఆవిష్కరణ చే యనున్నట్లు తెలిపారు. విశ్వ కర్మ జయంతి వేడుకలను బొమ్మూరు స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు జిల్లా పర్యటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News