వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిత్యవసర సరుకులు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితులకు తమ వంతు బాధ్యతగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వైసిపి నాయకులు… దాదాపుగా 50వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. హనుమాన్ పేట లోని నిత్యవసర సరుకులు పంపిణీ కోసం ప్యాకింగ్ చేసే విభాగన్ని పరిశీలించారు. నిత్యవసర సరుకులను మంగళవారం ఉదయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితుల కుటుంబాలకు అందజేయనున్నారు. శాసనమండలి సభ్యులు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వేలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రుహుళ్ల, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ ఇంచార్జ్ షేక్ అసిఫ్ ,నాయకులు పోతిన మహేష్, అడప శేషు, వై.సిద్దార్థ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *