Breaking News

వరదల వేళ సబ్ రిజిస్ట్రార్స్ అసోసియేషన్ సేవలు స్పూర్తి దాయకం

-రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా
-సింగ్ నగర్ లో 2500 కుటుంబాలకు ఒక్కొక్కటీ రూ.1100 విలువైన వస్త్రాల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్టార్స్ అసోసియేషన్ ముందడుగు వేయటం స్పూర్తి దాయకమని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవిన్యూ, విపత్తుల నిర్వహణ, భూ పరిపాలన, స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్స్) ఆర్ పి సిసోడియా అన్నారు. సోమవారం విజయవాడ సింగ్ నగర్ లో అసోసియేషన్ సమకూర్చిన వస్త్రాలను, సిసోడియా వరద బాధితులకు పంపిణీ చేసారు. ఒక్కొక్కటీ రూ.1100 విలువైన వస్త్రాల సంచిని 2500 కుటుంబాలకు పంపిణీ చేయగా, దానిలో ఒక చీర, లంగా, నైటీ ,లుంగీ, టవల్ అందించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ వరద రూపంలో ప్రకృతి ప్రకోపానికి గురైన సాటి మనుషులను ఆదుకొనడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఉద్యోగులు ఇప్పటికే 25 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారని, తాజాగా ఈ వితరణ కార్యక్రమాన్ని చేపట్టి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మధ్య నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్టార్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ గోపాల్, జనరల్ సెక్రటరీ ఎం కృష్ణ ప్రసాద్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు శాఖ విజయవాడ డిఐజి ఎ.రవీంద్రనాద్, నెల్లూరు డిఐజి వి. కిరణ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా రిజిస్ట్రార్ వి. ఎస్. ఆర్. ప్రసాద్, జిల్లా రిజిస్ట్రార్ (మార్కెట్ వాల్యూ అండ్ ఆడిట్) కె. రామారావు, రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖ అదికారలు, ఉద్యోగులు పాల్గొన్నారు. వరదల సమయంలో నిరంతరం సేవలు అందిస్తూ, బాధితులకు అండగా నిలిచిన సిసోడియను శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వర రావు ప్రత్యేకంగా సత్కరించారు. ఉదారత చూపుతూ ఇంత పెద్ద సంఖ్యలో వస్త్రాలను పంపిణీ చేయటం పట్ల సింగ్ నగర్ వాసులు ఆనందం వక్తం చేసారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *