Breaking News

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇసుక 13,95,004 మెట్రిక్ టన్నులు

-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం నాటికి రాష్ట్రంలోని 24 ఇసుక నిల్వ కేంద్రాలలో 13,95,004 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం 890 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది దరఖాస్తు చేసుకోగా, వారిరందరికీ ఇసుకను సరఫరా చేసామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్దితులు, వరద ప్రభావిత ప్రాంతాల వల్ల ఇసుక నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయని, వర్షాకాలం ముగిసిన తరువాత ఇసుక నిల్వలకు కొరత ఉండబోదని మీనా తెలిపారు. పలు చోట్ల రహదారులు దెబ్బతిన్న పరిస్ధితిలో ఇసుక రవాణాకు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వినియోగదారులు తమవంతు సహకారం అందించాలని విన్నవించారు. పలు రీచ్ ల నుండి ఇసుక సరఫరా నిలిచిపోయిందని, వర్షాలు తగ్గి, రవాణా పరిస్ధితులు మెరుగైన తురువాత పూర్తి స్ధాయిలో ఇసుక అందుబాటులోకి వస్తుందని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *