Breaking News

నేడు నాటిన మొక్కే, రేపు పర్యావరణ రక్షణ కవచం – రాయన భాగ్యలక్ష్మి, నగర మేయర్

-ప్రతి వార్డ్ లో ఏక్ పేడ్ మా కె నామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాలుష్యం నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, ఈరోజు నాటిన మొక్కే రేపు మనల్ని రక్షణ కవచంగా మారుతుందని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో అన్నారు. స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని వార్డులలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది చేపట్టారు అందులో భాగంగా 46వ డివిజన్లో పాల ఫ్యాక్టరీ దగ్గర నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అమ్మ కోసం మొక్కలను నాటే కార్యక్రమం నిత్యం జరుగుతూ ఉండాలని పర్యావరణ పరిరక్షణ కోసం ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ చూసుకోవాల్సిన బాధ్యత నాటిన వాళ్ళదేనని, వాటికి నీరు పోస్తూ ఆ మొక్క మహావృక్షమై పర్యావరణాన్ని రక్షించే పర్యావరణ కవచంగా మారాలని అన్నారు.  విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో తరచుగా మొక్కలను నాటే కార్యక్రమం చేయడం వల్ల విజయవాడ నగర పాలక సంస్థ పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ సుస్థిరాభివృద్ధికి అడుగులు ముందేస్తుందని తెలిపారు.

అమ్మ కోసం ఒక మొక్కని నాటితే, ఆ మొక్క అమ్మ వలె తిరిగి మనల్ని సంరక్షిస్తుందని, తల్లి ఒక బిడ్డని సంరక్షించుకునే విధంగా, ఆ మొక్క మనల్ని కాలుష్యం నుండి పరిరక్షిస్తుందని తెలిపారు. సెప్టెంబర్ 17, 2024 నుండి అక్టోబర్ 2, 2024 వరకు జరిగే స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వాములై పర్యావరణ పరిరక్షించడమే కాకుండా, విజయవాడ నగరపాలక సంస్థను స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులలో ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *