గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్చత పాటించడం ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలని, స్వచ్చత హి సేవాలో నగర పౌరులు విరివిగా పాల్గొనాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పిలుపునిచ్చారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఐటిసి ఎంఎస్కే ఫినిష్ సొసైటీ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ను, సిగ్నేచర్ క్యాంపెయిన్ ని కమిషనర్ గారు ప్రారభించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత స్వచ్చతతో పాటు, పరిసరాల స్వచ్చతను పాటించడాన్ని జీవన విధానంగా మార్చుకోవాలన్నారు. స్వచ్చ గుంటూరు కోసం నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో స్వచ్చతా హి సేవా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఐటిసి ఎంఎస్కే ఫినిష్ సొసైటీ సెల్ఫీ పాయింట్, సిగ్నేచర్ క్యాంపెయిన్ ల్లో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందితో పాటు, సాదారణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారన్నారు. అలాగే నగరంలో స్వచ్చత హి సేవా లో 2 వ రోజు అయిన బుధవారం ప్రభుత్వ కార్యాలయాలు, వార్డ్ సచివాలయాలు, దేవాలయాలు, పార్క్ ల పరిసరాల పరిశుభ్రం, ప్రజారోగ్య కార్మికులకు ప్రధమ చికిత్స పై అవగాహన శిబిరాలను నిర్వహించామన్నారు. నగరంలో వర్షం నీరు నిలిచిన నీటిలో దోమలు పెరగకుండా ఆయిల్ బాల్స్ వేయడం, యాంటీ లార్వా స్ప్రే చేస్తున్నామన్నారు. గురువారం నగర ప్రజలు సైకిల్ మీదనే తమ దైనిందిన పనులు నిర్వహించుకోవడం ద్వారా స్వచ్చత హి సేవాలో పాల్గొన వచ్చని తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, ఎంహెచ్ఓలు మధుసూదన్, రామారావు, మేనేజర్ ప్రసాద్, ఐటిసి ఎంఎస్కె అండ్ ఫినిష్ సొసైటీ నుండి నిరంజన్, నారాయణ, తిరుపతి రెడ్డి, జిఎంసి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …