-అర్హులైన వేద విద్యార్థులకు ప్రతినెలా 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి
-నిరుద్యోగ భృతి కై దరఖాస్తు సమర్పించుటకు చివరి తేదీ సెప్టెంబర్ 26
-జిల్లా దేవదాయ అధికారి వి.సోమరాజు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేద విద్య లో ఉత్తీర్ణత – పొంది నిరుద్యోగులుగా ఉన్న వారికి నిరుద్యోగ భృతి క్రింద నెల ఒక్కంటికి రూ.3,000/- పొందుటకు ఆశక్తి గల తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నిరుద్యోగ వేద పండితులు నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతోందని జిల్లా దేవదాయ అధికారి వి సోమరాజు గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేదవిద్య అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్న వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి అందించడం కోసం అర్హుల నుంచి దరఖాస్తులను కోరడం జరిగిందన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులు సమర్పించేందుకు సెప్టెంబర్ 26 వ తేదీ చివరి తేదీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
కావున వేద విద్యలో క్రమాంతం ఆపై కోర్సులు అభ్యసించి ఉత్తీర్ణత పొందిన నిరుద్యోగులు, నిరుద్యోగ భృతిని పొందుటకు వారి దరఖాస్తు తో పాటు వారి యొక్క వేద విద్య సర్టిఫికెట్లు నకలు, ఆధార్ నకలు మరియు ఏ విధమైన ఉద్యోగం చేయుట లేదని స్వీయ వాంగ్ముల (సెల్ఫ్ డిక్లరేషన్) ధృవపత్రం మొదలగునవి వారి దరఖాస్తు తో జతచేసి జిల్లా దేవదాయ శాఖ అధికారి, దేవదాయ ధర్మదాయ శాఖ, రాజమహేంద్రవరం వారి కార్యాలయము నందు ది. 26-09-2024 సాయంత్రం గం.5.00ల లోపు సమర్పించ వలసినదిగా జిల్లా దేవదాయ అధికారి వి.సోమరాజు తెలియచేసినారు. మరింత సమాచారం కొరకు 0883-2478375 ఫోన్ నెంబర్ ను కార్యాలయ పని వేళల్లో సంప్రదించ వచ్చునని తెలిపారు.