Breaking News

ఉచిత ఇసుక సులభతరమైన విధానంలో వినియోగదారులకి అందించేందుకు చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉచిత ఇసుక పాలసీ విధానంలో వినియోగదారులకి ప్రభుత్వ యంత్రాగం సులభతరం చేసే విధానం లో విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లతో ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఇతర అనుబంధ శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇసుక రవాణా చేసే విధానంలో తూర్పుగోదావరి జిల్లా ఎంతో కీలకమైన బాధ్యతను వహించాల్సి ఉందన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ఇతర జిల్లాలకు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఇసుక రవాణా కోసం గోదావరీ ఇసుకకి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని, వినియోగదారులతో స్నేహ పూర్వక విధానంలో బాధ్యత నిర్వహించాల్సి ఉండాలన్నదే ప్రభుత్వం ముందున్న ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. పూర్తి ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నిర్వర్తించాలని, ప్రజల వినియోగదారుల సంతృప్తి చెందేలా జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం, వాటిని సమర్ధవంతంగా అమలు చెయ్యడంలో జిల్లా కలెక్టర్ల కీలక బాధ్యత అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లాకు చెందిన వివరాలను తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి ఉచిత ఇసుక పాలసీ అమలులో పారదర్శకంగా, జవాబు దారీతనంతో వ్యవహరిస్తామని తెలియజేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ప్రభుత్వ యంత్రాంగం ఫెసిలిటేటర్ గా విధులను నిర్వహిస్తామని, ఉచిత ఇసుక సులభతరమైన విధానంలో వినియోగదారులకి అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి ,ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా లకు చెందిన వారితో పాటుగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకి చెందిన వినియోగదారులకి ఇసుక సరఫరా చేస్తున్నట్లు వివరించారు. జూలై 8 నుంచీ ప్రారంభించిన ఉచిత ఇసుక పాలసీ విధానం పారదర్శకత తో కూడి వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. జూలై 8 నాటికి 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులొ ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులొ ఉందని, ఇవీ రానున్న 15 రోజులకు సరిపోతుందని వివరించారు. సచివాలయం ద్వారా బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరుగుతుందని, అదే విధంగా జిల్లా కలెక్టరేట్, మండల స్థాయి లో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాల్లో కొత్తగా తొమ్మిది డిసిల్టీషన్ పాయింట్స్ గుర్తించామని, మరో 10 పాయింట్లు గుర్తుంచనున్నట్లు కలెక్టరు తెలియ చేశారు. వినియోగదారుల సంతృప్తి చెందేలా ఉచిత ఇసుక పాలసీ విధానంలో ఫెసిలిటేటర్ గా విధులను నిర్వర్తించడం జరుగుతుందని కలెక్టర్ తెలియ చేశారు. బోట్స్ మ్యాన్ సొసైటిలను గుర్తించి డీ సిల్టేషన్ పాయింట్ల ను కేటాయించినట్లు తెలియ చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఇతర సమన్వయ శాఖల కమిటీ అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *